జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ అఖల్’ (Operation Akhal) మూడవ రోజుకు చేరింది. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు మరో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. మొత్తం మృతుల సంఖ్య ఇప్పటివరకు ఆరుకు చేరినట్టు అధికారులు తెలిపారు. జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు గాయపడినట్టు సమాచారం. ఆయనను చికిత్స నిమిత్తం దగ్గరలోని సైనిక ఆసుపత్రికి తరలించారు.

సంయుక్త శోధన చర్యల నేపథ్యంలో ఎదురుకాల్పులు
పక్కా నిఘా సమాచారం మేరకు భద్రతా బలగాలు (జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)పోలీసులు, భారత సైన్యం, CRPF) శుక్రవారం ఈ ప్రాంతంలో కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ (Cordon-and-search operation) ప్రారంభించాయి. అయితే తమను గుర్తించిన ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయి కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రాత్రంతా కాల్పుల మోతతో దద్దరిల్లిన ఈ ప్రాంతంలో నేడు మరో ముగ్గురిని హతమార్చాయి.
లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్‌కు చెందిన ఉగ్రవాదులు
నిన్న హతమైన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)కు చెందినవారని అధికారులు వెల్లడించారు. ఈ సంస్థ 2025లో పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరుల హత్యకు బాధ్యత వహించింది. ఈ ఆపరేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భద్రతా యంత్రాంగం అత్యాధునిక నిఘా పరికరాలు, ప్రత్యేక బలగాలు, మరియు డ్రోన్లు వాడుతూ ఉగ్రవాదుల సంచారంపై పట్టు సాధిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: