Vastu reasons for family disputes:ప్రశ్న: నాకు మా అమ్మకు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. అయినా గొడవలు వస్తుంటాయి. మా తమ్ముడు సరిగ్గా చదవడం లేదు. మాకు రావాల్సిన డబ్బు సమయానికి రావడం
లేదు. అప్పులు చేయాల్సి వస్తోంది. ఎందువల్ల?
జవాబు: మీరు ఊహించింది నిజమే. మీ ఇంటికి వాస్తు పరమైన దోషాలున్నాయి. తూర్పున ఒక ద్వారానికి ఎదురుగా సెప్టిక్ ట్యాంకు వుంది. ఆ ద్వారాన్ని తీసేసి గోడకట్టండి. ఇంటి తూర్పు గోడనానుకొని బయటకు లెట్రిన్, బాత్రూ ములున్నాయి. అలా వుంటే కూడా వాటిని నైరుతి లేదా ఆగ్నేయ ఖాళీ స్థలాల్లోకి మార్చండి. ఆగ్నేయంలో అయితే తూర్పు కాంపౌండుగోడ (వుంటే)ను తగలకుండా కనీసం మూడడుగుల ఖాళీ స్థలం వదిలిపెట్టండి. ఇంటికి దక్షిణ ఆగ్నేయంలోగానీ, పశ్చిమ వాయ్యంలోగానీ ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలి. ఇంట్లోవాళ్ల సఖ్యత,ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.
పాత ఇంటిని కలిపి..?
ప్రశ్న: మీరిచ్చిన సలహాలు చదివాను. అందులో నైరుతి మూసివేయాలని ఉంది. మా పాత
ఇంటిని కలుపుకొని మూసివేయాలా? లేక కలపకుండా మూసివేయాలా? తెలుపగలరు.
జవాబు: దక్షిణ, పశ్చిమ ప్రహరీ గోడలను ఆనుకొని నైరుతి మూలలో ఉత్తర లేక తూర్పు వాలుగా పైకప్పు వేసి నైరుతి మూత వేయాలి. రేకులువేస్తే తూర్పు లేక ఉత్తర వాలుగా వేయాలి. ఇంటికి (home) ఆ కప్పుగానీ, గదిగానీ తగలకూడదు. నైరుతి మూలలో పని మొదలుపెట్టి ఆగకుండా శీఘ్రంగా పని (work) పూర్తి చేయాలి. అది పూర్తయ్యేవరకు ఆ ఇంటి యజమాని పరాయి ఊళ్లకు వెళ్లకూడదు.
సవరణలు చెప్పగలరు
ప్రశ్న: ఇల్లు కట్టాలని నేను పన్నెండు సెంట్ల స్థలం కొన్నాను. ఇంటి ప్లాను నేను స్వయంగా వేసి, మీకు పంపించాను. ఇంటి ప్లాను పరిశీలించి సవరణలు తెలుపగలరు. జవాబు: డైనింగ్ హాల్, హాల్లోకి నడక పశ్చిమ నైరుతి నుండి వుంది. అలా కాక పశ్చిమ వాయవ్యం నుండి ప్రధాన ద్వారం ఏర్పాటు చేయండి. మీరు దక్షిణాభిముఖంగా వంట చేస్తున్నారు. తూర్పుకు అభిముఖంగా వంట చేయడం మొదలు పెట్టండి.
ఈశాన్యం అరుగులు?
ప్రశ్న: ఈ ఇల్లు మా పూర్వీకులు కట్టినది. తూర్పు ముఖం చేసి వుంది. తూర్పువైపుగానీ, ఉత్తరంవైపుగానీ మాకు ఖాళీస్థలం లేదు. ఇంటిముందు చిన్న అరుగు ప్రవేశ ద్వారం ముందు మెట్లువున్నాయి. ఈశాన్యం వైపు అరుగులు పెరిగితే మంచిదని తూర్పు ఈశాన్యం వైపు, తూర్పు ఆగ్నేయంవైపు సిమెంటు పలకలతో అరుగు వెడల్పు చేయించాను. ఇలా చేయటం వల్ల ఈశాన్యం
‘మూసివేసినట్లు అవుతుందా?
జవాబు: అలా చేయడం వల్ల ఒక విధంగా ఈశాన్య మూతనే అవుతుంది. తిరిగి మామూలు ప్రకారం
చేయించండి.
బావి ఎక్కడ తవ్వించాలి?

ప్రశ్న: ఈ మధ్యనే మేం మూడున్నరగుంటల స్థలం కొన్నాం. అందులో కోళ్లఫారం పెట్టాలని అనుకుంటున్నాం.ప్లాను పంపిస్తున్నాను. వాస్తు ప్రకారం ఏవిధంగా కట్టవచ్చో తెలుపుగలరు. బావి
ఎక్కడ తవ్వించాలో చెప్పగలరు.
జవాబు: మీరు తీసుకొన్న స్థలం దక్షిణ నైరుతి పెరిగి వుంది, దాని నైరుతిలను మూలమట్టానికి సరిచేయండి. కోళ్లఫారంలో మీరు వేయవలసిన షెడ్లు ఎన్నో తెలుపలేదు. షెడ్‌ని స్థలానికి
నైరుతి మూలకు దగ్గరలో నిర్మించండి. షెడ్స్‌ని దక్షిణ, పశ్చిమ దిక్కుల్లో వదిలే ఖాళీస్థలం కంటే ఉత్తర, తూర్పు దిక్కుల్లో చాలా ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదలండి. షెడ్స్‌ని ఉత్తర, దక్షిణాలకు
రెండు వైపులా వాలు వచ్చేటట్లు నిర్మించాల్సి ఉంటుంది. బావిని ఉత్తర భాగంలో నిర్మించుకోవడం మంచిది. అయితే బావి ముందు గేటు రాకుండా జాగ్రత్త పడటం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు శీఘ్రంగా కనిపిస్తాయి.
ఈశాన్యంలో బాత్రూమ్..?

ప్రశ్న: నాలుగు పక్కల కాంపౌండు గోడ వున్నది. దక్షిణం వైపు నుంచి వాలు ఉత్తరంవైపుకు వచ్చేటట్టు కట్టి వున్నది. వరండా ఖాళీగా అంటే ఒకవైపు గోడ కట్టకుండా ఖాళీగా ఉన్నది. లోపల పెద్ద గది, దాని మధ్యలో చిన్న పిట్టగోడలా కట్టి కిచెన్వాల్ వేరు చేశారు. ఈశాన్యంలో
బాత్ రూమ్ కట్టారు. పంపు కూడా బాత్రూ ములోనే వున్నది. పైన కప్పు లేదు. ఇల్లు ఉత్తరంవైపు ముఖం చేసి వుంది. అంటే ఇంటివాళ్లు ఉత్తరం నుండి తూర్పుగా వచ్చి దక్షిణం గేటు గుం వెళతారు, ఇలా వుండవచ్చా?
జవాబు: దక్షిణ ఆగ్నేయంలో వున్న గేటు ద్వారా రెండు పోర్షన్లలో వుండేవాళ్లు బయటకు నడవటం కూడా బాగానే ఉంటుంది. ఈశాన్య మూలకు దగ్గరగా తూర్పుగోడనానుకొని వేసిన బాత్ రూమ్ వల్ల చెడు ఫలితాలు వచ్చే అవకాశం వుంది. దానిపైన కప్పు లేదు కనుక కొంతవరకు పరవాలేదు. దాన్ని టాయిలెట్‌గా వుపయోగించకపోవటం వలన చెడు ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. వీలయితే బాత్రూమ్, టాయ్‌లెట్స్ ని అక్కడ నుండి తొలగించటం మంచిది.
Read also: hindi.vaartha.com
Read also: