హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి శుక్రవారం నుంచి పేస్ రికగ్నేషన్ (Facial Recognition) అటెండెన్స్ (ముఖ గుర్తింపు హాజరు) ప్రారంభమైంది. ఇప్పటికే దీనిని గత ఏడాది డిసెంబర్ లో పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి జిల్లాలో ప్రారం భించగా.. ఆగస్టు 1(శుక్రవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని పాఠశాల విద్య శాఖ నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ గుర్తింపు హాజరును మొదటిరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 93 శాతం హాజరు ప్రారంభించినట్టు పాఠశాల విద్య శాఖ అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బందికి శుక్రవారం నుండి ముఖ గుర్తింపు హాజరును అమల్లోకి తీసుకొచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.

విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 24973 ఉండగా అందులో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కలిపి 1,28,760 మంది ఉన్నారని తెలిపారు. వారిలో శుక్రవారం ముఖము గుర్తింపు హాజరు ఆప్ ద్వారా 96,327 (75శాతం) మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 89,922 (93.3శాతం) మంది తమ హాజరును ముఖ గుర్తింపు హాజరు యాప్ ద్వారా నమోదు చేయడం జరిగిందని అధికారులు ప్రకటించారు.
READ MORE :