మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ కుదిపేసింది. కేవలం 13 ఏళ్ల చిన్నారి ఆక్లన్ జైన్ (Oakland Jain) ఆన్లైన్ గేమ్ ‘ఫ్రీ ఫైర్’లో డబ్బులు పోగొట్టుకున్నందుకు భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మరోసారి ఆన్లైన్ గేమ్స్ పిల్లలపై చూపుతున్న ప్రభావాన్ని స్పష్టంగా బయటపెట్టింది.ఆక్లన్ జైన్ ఏడో తరగతిలో చదువుతున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన ఫ్రీ ఫైర్ గేమ్‌లో అదనపు ఫీచర్లు కొనుగోలు చేసేందుకు తన తల్లి డెబిట్ కార్డు వివరాలను గేమ్ అకౌంట్‌కు లింక్ చేశాడు. గేమ్ ఆడుతూ రూ.2,800 ఖర్చు చేసి పోగొట్టుకున్నాడు. డబ్బులు నష్టపోవడంతో భయాందోళనకు గురైన ఆక్లన్, తన తల్లికి చెప్పాడు. అయితే ఆమె ఏమి చేస్తుందోననే భయంతో మానసిక ఒత్తిడికి లోనై, చివరికి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య (suicide) కు పాల్పడ్డాడు.
ఆన్లైన్ గేమ్స్ పిల్లలపై ప్రభావం
ఈ సంఘటన కేవలం ఒక కుటుంబానికే కాకుండా సమాజానికి ఒక హెచ్చరికగా మారింది. పిల్లలతో తరచూ మాట్లాడి వారి మనసులోని భయాలు, ఒత్తిడిని అర్థం చేసుకోవడం, వారికి సహాయపడే వాతావరణం కల్పించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అదేవిధంగా ప్రభుత్వం, పాఠశాలలు, సాంకేతిక సంస్థలు కలిసి ఆన్లైన్ గేమ్స్‌పై పిల్లల భద్రతా చర్యలు చేపట్టడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: