పా ప్రొటెక్ అనే ప్రయోజనాత్మక మొబైల్ షెల్టర్ ప్రోగ్రాంను హైదరాబాద్, చెన్నైలకు విస్తరించిన మార్స్ పెట్‌కేర్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్
దేశమంతటా వర్షాలు విస్తరిస్తున్నాయి. దీంతో వీధికుక్కలకు రక్షణ కల్పించేందుకు మార్స్ పెట్‌కేర్, దేశంలో ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం అయిన ఇన్‌స్టామార్ట్ కలిసి తమ సంయుక్త చొరవ అయిన పా ప్రొటెక్‌ను హైదరాబాద్ (Hyderabad) కు విస్తరించాయి. వీధికుక్కలు, పిల్లుల కోసం మొబైల్ షెల్టర్లను ఏర్పాటుచేసేందుకే ఈ పా ప్రొటెక్ అనే కార్యక్రమాన్ని తొలిసారిగా చేపట్టారు. ఈ షెల్టర్లలో ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జంతువులకు సురక్షితమైన, పొడి, నీడ ఉండడంతో అవి క్షేమంగా ఉంటాయి. గత సంవత్సరం ఆగస్టులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ప్రారంభించిన తర్వాత ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ నగరాలకు విస్తరించారు. దీంతో ఇప్పటికి దేశవ్యాప్తంగా మొత్తం 700 షెల్టర్లను ప్రారంభించినట్లయింది.
ప్రత్యేకంగా డిజైన్
ఎక్కడా గూడు, నీడ లేని జంతువులు విపరీతమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బంది పడతాయి. వర్షాకాలం ఎక్కువగా ఉండడంతో వాటిని రక్షించడానికే ఈ పా ప్రొటెక్ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ షెల్టర్లు వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ జంతువులకు సురక్షితమైన ప్రదేశాన్ని అందిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంగా స్థానిక జంతుప్రేమికులు, (Local animal lovers) ఫీడింగ్ గ్రూపులు వీటిని ఆదరిస్తున్నాయి. వీటి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.
చాలా జంతువులకు
ప్రపంచంలోనే ఇలా వీధుల్లో తిరిగే జంతువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. మార్స్ సంస్థ 2023లో విడుదల చేసిన స్టేట్ ఆఫ్ పెట్ హోంలెస్‌నెస్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 6.9 కోట్ల వీధి జంతువులు ఉన్నాయి. చాలా జంతువులకు తగిన నీడ, ఆహారం, శుభ్రమైన నీరు దొరకదు. వర్షాకాలంలో ఇబ్బందులు మరీ ఎక్కువ. భారీ వర్షాలు, వరదలతో అవి పొడిగా ఎక్కడా ఉండలేక అనారోగ్యం, గాయాలు అవుతుంటాయి.
రెండు నగరాల్లోనూ
ఈ సందర్భంగా మార్స్ పెట్ కేర్ ఇండియా ఎండీ సలిల్ మూర్తి మాట్లాడుతూ, “జాలి, సమాజం ఈ రెండూ కలిస్తే వచ్చిన సరికొత్త ఉద్యమమే పా ప్రొటెక్. స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలు, ఫీడర్ నెట్‌వర్కులు, సాధారణ పౌరులు కూడా ఈ మొబైల్ షెల్టర్లను ఆదరించి, నిర్వహించడంతో ఇవి మరింత అర్థవంతంగా మారాయి. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై నగరాలకు విస్తరించాం. ఈ రెండుచోట్లా వర్షాలు బాగా ఎక్కువ. అలాగే రెండు నగరాల్లోనూ వీధి జంతువుల జనాభా కూడా ఎక్కువ. విస్తృత సమాజం మద్దతుతో మేం ఈ జంతువులకు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమన్న మా నమ్మకాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాం” అని చెప్పారు.
పెంపుడు జంతువుల
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ చౌధరి మాట్లాడుతూ, “పా ప్రొటెక్ చొరవ కోసం మార్స్ పెట్ కేర్‌తో భాగస్వామ్యం ఎంతో ఆనందంగా ఉంది. మన చుట్టూ ఉండే జంతువులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా మరింత క్షేమంగా ఉండేందుకు చేస్తున్న చిరు ప్రయత్నమిది. ఇన్‌స్టామార్ట్ యూజర్లలో పెంపుడు జంతువుల ఆహార విభాగంలో ఉండేవారి నుంచి దీనికి మంచి స్పందన లభిస్తోంది. అంటే జంతువుల పట్ల వారికున్న ప్రేమ బయటపడుతోంది. మన జీవితాల్లో ఎంతో ఆనందాన్ని నింపే జంతువులకు మద్దతు ఇవ్వడం, వాటికి తిరిగి ఎంతో కొంత సాయం చయేడమనే మా విధానానికి ఈ కార్యక్రమమే నిదర్శనం” అని తెలిపారు.

తమ ప్రాంతంలోనే
ప్రముఖ నటి, జంతుసంక్షేమ ఉద్యమకారిణి, బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల మాట్లాడుతూ, “పా ప్రొటెక్ లాంటి చొరవలు ఇంత జాగ్రత్తతో పెరుగుతూ, ఉద్దేశాల్లో స్పష్టత ఉండడం చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. గూడులేని జీవాలు మన చుట్టూ ఉంటాయి. అవి మన నగరంలో, మనతో భాగంగానే ఉంటాయి. వాటికి గూడు ఇవ్వడం అనేది కేవలం జాలి కాదు.. మానవత్వం. వ్యక్తులు, సంస్థలు, సమాజాలు కలిసి పనిచేస్తే జీవించే ప్రతి ఒక్కరికీ, అన్ని జంతువులకూ సమానమైన గౌరవం, సానుభూతి లభిస్తాయి. కుక్కలు సాధారణంగా తమ ప్రాంతంలోనే ఉంటాయి. అందువల్ల ఈ షెల్టర్లను రద్దీ రోడ్లకు, సాధారణ పార్కులకు, ఫుట్‌పాత్‌లకు దూరంగా ఏర్పాటుచేయాలని సూచిస్తున్నాను. దానివల్ల వీటికి కూడా ఇబ్బంది ఉండదు. మరిన్ని నగరాల్లో కూడా ఈ తరహా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. ” అన్నారు.
క్షేత్రస్థాయి సంస్థల
ఫ్రెండికోస్ సెకా లాంటి స్వచ్ఛంద సంస్థలు, బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్, మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ లాంటి క్షేత్రస్థాయి సంస్థల భాగస్వామ్యంతో ఈ షెల్టర్లు ఏర్పాటుచేస్తున్నారు. వీధికుక్కలు ఎక్కువగా ఉండి, వాటికి సహజమైన గూడు లేని బాగా అవసరం ఉన్న ప్రాంతాల్లో వీటిని పెడుతున్నారు. వాతావరణాన్ని తట్టుకునేలా, నిర్వహణ సులభంగా ఉండేలా ఏర్పాటుచేసిన ఈ షెల్టర్లు స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో నడుస్తున్నాయి. వాటిద్వారా తగినంత ఆహారం, నీరు అందుతాయి.వీటి డిజైన్ చాలా ప్రాక్టికల్‌గా ఉందని, ప్రభావం కనిపిస్తోందని ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రశంసలు, గుర్తింపు వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో శీతాకాల షెల్టర్లను కూడా ఉత్తరాదిలోని నగరాల్లో జంతువుల సంరక్షణకు ఏర్పాటుచేశాము.
వీధి కుక్కల ఆశ్రయాలను ఎవరు ఏర్పాటు చేస్తారు?
ప్రభుత్వ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జంతు సంక్షేమ సంస్థలు, ఎన్‌జీవోలు (NGOs), కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆశ్రయాలు ఏర్పాటు చేస్తాయి.
వీధి కుక్కలను ఆశ్రయాలకు ఎలా తరలించాలి?
జంతు సంక్షేమ హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి, పశువైద్య సిబ్బందితో సురక్షితంగా తరలించాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: