బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు ( Kangana Ranaut)పంజాబ్-హర్యానా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బటిండా కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ పరువు నష్టం దావా రద్దు చేయాలంటూ కంగనా (Kangana Ranaut) దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది (refused). ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద అభియోగాలు మోపారని, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల ఉత్తర్వు చట్టబద్ధమైనదని జస్టిస్ త్రిభువన్ దహియా సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంపై ఆమె చేసిన ట్వీట్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. కంగనా చేసిన రీట్వీట్‌లో బటిండాకు చెందిన మహిందర్ కౌర్ ఫొటోలో అందులో ఉన్నది. ఢిల్లీ షాహిన్‌బాగ్ నిరసన తెలుపుతున్న మహిళలో లింక్ చేయడంపై తన పరువు భంగం కలిగించారని ఆమె కోర్టును ఆశ్రయించారు.దాంతో కోర్టు పరువు నష్టం కేసులో కంగనాకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసింది.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కంగనా రనౌత్ (Kangana Ranaut) మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని.. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత చట్టపరమైన ప్రక్రియ మేరకు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారని హైకోర్టు పేర్కొంది. ట్వీట్లో ఆమె ఉద్దేశమేమీ తప్పు కాదని.. సరిగ్గానే ట్వీట్ చేసిందని కంగనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించినా కోర్టు అంగీకరించలేదు. కంగనా ఆ ట్వీట్ చేయలేదని.. కేవలం రీట్వీట్ చేసిందని.. ట్వీట్లో గౌతమ్ యాదవ్ పేరును చేర్చలేదని.. కంగనాపై మాత్రమే పిటిషన్ దాఖలైందంటూ చేసిన వాదనలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు 2021 రైతు ఉద్యమం సమయంలో కంగనా ఈ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో మహిందర్ కౌర్ అనే 87 ఏళ్ల వృద్ధ మహిళ రూ.200 తీసుకుని ఆందోళనకు వచ్చినట్లుగా కంగనా ట్వీట్ చేశారు.
కంగనా రనౌత్ రిచ్?
కంగనా రనౌత్ నికర విలువ: రూ. 91 కోట్ల ఆర్థిక పోర్ట్‌ఫోలియోను అన్వేషిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి మరియు ఎంపీ కంగనా రనౌత్ నటన మరియు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా గణనీయమైన సంపదను సంపాదించారు. అయితే, ఆమె ఆదాయం 2022-23లో మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ₹4.12 కోట్లకు తగ్గింది.
కంగనా రనౌత్ పర్సనల్ లైఫ్?
కంగన 1987 మార్చి 23న హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని మనాలి సమీపంలోని భంబ్లాలో జన్మించింది. ఆమె తండ్రి అమర్దీప్ ఒక వ్యాపారవేత్త మరియు ఆమె తల్లి ఆశా ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు మరియు ఒక తమ్ముడు ఉన్నారు. ఆమె తాత ఒక IAS అధికారి
కంగనా రనౌత్ విద్యార్హత?
ఆమె చండీగఢ్‌లోని DAV స్కూల్లో చదువుకుంది, మరియు పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఆమె సిమ్లాలోని ఒక కళాశాలలో చదువుకుంది, అక్కడ ఆమె సైన్స్‌ను తన ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకుంది . ఆమె కుటుంబం ఆమెను డాక్టర్ కావాలని పట్టుబట్టింది, అందుకే కంగనా ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్‌కు సిద్ధమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mohan Bhagwat: మాలేగావ్ పేలుళ్ల కేసులో మాజీ అధికారి