ఏడవ తరగతి చదివే కావ్య తెలివైనది. అప్పుడప్పుడు అమ్మానాన్న ఇచ్చిన డబ్బుతో బొమ్మలు కొనుక్కుని ఖాళీ ఉన్నప్పుడు ఆడుకునేది. ఒకసారి కావ్య వాళ్లమ్మ పక్కింటావిడతో బొమ్మల కొలువు గురించి మాట్లాడుతుండగా ఆలకించింది కావ్య.
కొన్ని రోజుల్లో వచ్చే దసరాకి బొమ్మల కొలువు చేయాలని, తన స్నేహితులను పిలిచి చూపించాలని అనుకుంది కావ్య. తన దగ్గర ఏయే బొమ్మ
లున్నాయో చూసుకుంది. ఆ బొమ్మలు మాత్రం బొమ్మలకొలువు చేయడానికి సరిపోవని, మరిన్ని కొత్త బొమ్మలు కొనుక్కోవాలని అనుకుంది కావ్య. అంతలో బయట కాకి అరిచింది. కాకి అరుపు వినగానే పక్షులు, జంతువుల బొమ్మల్ని కూడా బొమ్మల కొలువులో.
పెట్టాలన్న కోరిక కలిగింది కావ్యకు. దసరా నాడు స్నేహితురాళ్లని పిలిచి బొమ్మలతో కొలువు చేర్చింది. రోజంతా ఆడుకున్నారు పిల్లలు. (children) బాగా అలసిపోయిన కావ్య అక్కడే నిద్రపోయింది. అమ్మ (mom) వచ్చి కావ్యను ఇంటిలోపలకు
తీసుకువెళ్లగా, బొమ్మలు బయట గడపలో కొలువు దగ్గరే ఉండిపోయాయి. తరువాత రోజు ఉదయం కావ్య చూసుకుంటే వాటిలో కాకి బొమ్మ కనబడలేదు.

అమ్మను అడిగితే తెలియదని చెప్పింది. నాన్న పని మీద వెళ్లాడు. ఇంటి చుట్టూ ప్రహరీ ఉండడంతో బయటివారు తీసే అవకాశం లేదు. బొమ్మ పోవడంతో ఏడుపు వచ్చింది కావ్యకు. అటుగా పిల్లి వెళుతుంటే ‘కాకి బొమ్మను తీసావా?” అని అడిగింది కావ్య. ‘పాలు తాగుతాను. ఎలుకల్ని తింటాను కానీ బొమ్మ నాకెందుకు.’ అంది పిల్లి.
పిల్లిని చూసి కంతలోకి దూరుతున్న ఎలుకను ‘నువ్వు తీసావా?’ అని అడిగింది కావ్య. ‘తినే వస్తువు కావాలి కానీ బొమ్మ ఏమి చేసుకుంటాను?’ అనేసి దాక్కుంది కావ్య. అన్నము, మాంసం ముక్కలు కావాలి. బొమ్మ నాకెందుకు?’ అంది కుక్క, కోడి, బాతులనీ అడిగింది.
అవి తియ్యలేదని చెప్పాయి. కావ్య ఉసూరుమంటూ కూర్చుంది. దొడ్లో ఉన్న జామచెట్టు మీద ఒక చిలుక వాలి కావ్యను పలకరించింది. దాని మాటలకు ఉత్సాహం వచ్చింది కానీ బొమ్మపోయిన బాధను దాచుకోలేకపోయింది కావ్య. జరిగిందంతా చిలుకతో చెప్పింది.
‘నీ స్నేహితులే తీశారేమో’ అంది చిలుక. ‘లేదు. అడగకుండా తీయరు. మేము ఆడుకుంటూవుండగా ఒకకాకి బొమ్మల్ని చాలాసేపు చూసింది.
అది తీసిందంటావా’ అని అడిగింది .
కావ్య. ఆ కాకి ఆనవాళ్లని కూడా చెప్పింది చిలుకతో, ‘ఇక్కడకు పక్కనే మా అడవి. మా అడవిలో ఉన్న కాకి నువ్వు చెప్పినట్టే ఉంటుంది. దాన్ని అడుగుతాను’ అనేసి ఎగిరిపోయింది చిలుక. అడవికి వెళ్లి కాకిని అడిగింది కానీ తెలియదని అది చెప్పడంతో పక్షిరాజుని కలసి జరిగిందంతా చెప్పింది చిలుక. ‘నా కెందుకో కాకి మీద అనుమానం ఉంది’ అంది చిలుక. కాకినే కాకుండా అన్ని పక్షులను పిలిచి అడిగింది పక్షిరాజు. నేనటువైపు వైపు వెళ్లలేదు’ అంది పావురం.
‘నా నాట్యంతో మెప్పిస్తాను తప్ప దొంగతనం తెలియదు’ అంది నెమలి’, చేపల్ని తింటాను కానీ బొమ్మ నేనేం చేసుకోవాలి?’ అంది కొంగ. దాదాపు అన్ని పక్షులూ బొమ్మను తీయలేదనే చెప్పాయి.
అంతవరకూ కాకి ఎక్కడికో వెళ్లడం వల్ల రాలేదు.

తరువాత వచ్చి ‘నేనే కాకిని. కాకి బొమ్మ నాకెందుకు?’ అంది. మరెవరు తీసినట్టు’ అని పక్షిరాజు అంటుండగా ‘మనమే తీశామని ఎందుకనుకుంటారు? మనుషులే తీసారేమో’ అనుమానంగా చెప్పింది కాకి. అంతలో మైనా అక్కడకు వచ్చి కాకి పిల్ల ఆ బొమ్మతో ఆట్లాడుతుండగా చూసానని చెప్పింది. పక్షిరాజు తీక్షణంగా చూసి ‘నిజం చెబుతావా’ దండించమంటావా?’ అని కాకిని అడిగింది. కాకి ‘బొమ్మలతో ఆడుతున్న పిల్లల్ని చూసాక నా పిల్ల కూడా అలా ఆడాలని తెచ్చాను’ అని నిజం ఒప్పుకుంది.
‘మన బొమ్మల్ని కొలువులో పెట్టిందని సంతోషపడాలి కానీ బొమ్మ ఎత్తుకొస్తావా? ఆ బొమ్మను ఇచ్చేసి క్షమాపణ చెప్పేసి రా. చిలుక కూడా నీతో వస్తుంది’ అని ఆదేశించింది పక్షిరాజు.
చిలుక, కాకి కలసి వెళ్లి బొమ్మను కావ్యకు ఇచ్చాయి. బొమ్మ తీసుకుపోయినందుకు క్షమాపణ చెప్పింది కావ్యకి. బొమ్మ దొరికినందుకు ఆనందపడిన కావ్య ‘దొంగతనం తప్పు కదా. అలా తియ్యకూడదని అమ్మ చెప్పింది. నన్నడిగితే బహుమతిగా ఇద్దును. నాకొద్దు ఆ బొమ్మ. మీ
పిల్లకు నా కానుకగా తీసుకో” అని తిరిగి ఇచ్చేసింది కావ్య. చిలుక చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇంట్లో ఉన్న తియ్యటి పండును బహుమతిగా దానికి ఇచ్చింది కావ్య.
Read also:hindi.vaartha.com
Read also: Unity:ఐక్యంగా ఉంటాం