సమాజంలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు ఎదుర్కొనే కష్టాలు చాలానే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా (Suryapet District) మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నడవరాని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు తనకు రావలసిన పెన్షన్ కోసం కుర్చీ సహాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుర్చీని అడ్డం
ఈ వృద్ధురాలు నడిచే శక్తి లేకపోయినా, తన పెన్షన్ కోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా స్వయంగా వెళ్లే ప్రయత్నం చేసింది. చేతికి కర్ర కూడా లేకపోవడంతో ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ (Plastic chair) ని అడ్డం పెట్టుకుని దానిని సపోర్ట్‌గా ఉపయోగించి అంగడంగ అడుగులు వేసింది. ఆమె తీసిన ప్రతి అడుగు కష్టాల గాధను చెబుతూ ఉండటంతో అక్కడి స్థానికులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
పెన్షన్ ఎప్పుడు జమ అవుతుంది?
సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో (1వ తేదీ నుండి 10వ తేదీ మధ్య) లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది లేదా డోర్ డెలివరీ ద్వారా అందిస్తారు.
పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
స్థానిక పంచాయతీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం లేదా MeeSeva కేంద్రం ద్వారా అవసరమైన పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: