हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Peddapalli: 100 రూపాయల కోసం ఒక వ్యక్తి బలి

Sharanya
Peddapalli: 100 రూపాయల కోసం ఒక వ్యక్తి బలి

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం ఎన్టీపీసీ (NTPC) పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.100 కోసం ప్రారంభమైన వాగ్వాదం చివరికి ఒక నిర్లక్ష్యమైన హత్యగా ముగిసింది. ఒక నిరాయాస జీవితం గడిపే కార్మికుడు దారుణంగా బలయ్యాడు.

జీవనోపాధి కోసం వచ్చిన వినోద్‌

మహారాష్ట్ర రాష్ట్రం చంద్రాపూర్ జిల్లా జాట్లాపూర్ గ్రామానికి చెందిన వినోద్ బాబాజీ (Vinod Babaji) సొస్కరి (44) పేరుతో ఉన్న కార్మికుడు, రామగుండం ప్రాంతంలో భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతరుల మాదిరిగా రోజువారీ కూలితో కుటుంబాన్ని పోషించడమే లక్ష్యంగా జీవించేవాడు.

అప్పుల తగాదా.. గొడవకు రూపం

బుధవారం రాత్రి, వినోద్‌తో కలిసి పనిచేస్తున్న మనోజ్ అనే వ్యక్తి, మరో కార్మికుడు నీలకంఠకు రూ.300 అప్పుగా ఇచ్చాడు. అయితే నీలకంఠ అప్పును పూర్తిగా తిరిగి ఇవ్వక, కేవలం రూ.200 మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బును తర్వాత ఇస్తానని చెప్పాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.

రాత్రివేళ దారుణ దాడి

ఈ విషయంలో ఇద్దరు గొడవ పడుతుండగా, గొడవ పడకుండా బయటికి వెళ్లమని చెప్పిన వినోద్. బయటకి వెళ్లమన్నాడనే కోపంతో అందరూ నిద్రిస్తున్న సమయంలో, వినోద్ తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన మనోజ్.

రక్తపు మడుగులో వినోద్‌

ఉదయం ఎంతకీ వినోద్ నిద్రలేవకపోవడంతో అతని వద్దకు వెళ్లిన ఇతర కార్మికులు ఆయనను రక్తపు మడుగుల్లో గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు.

నిందితుడి అరెస్ట్ – విచారణలో పోలీసులు

ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న ఎన్టీపీసీ పోలీసులు, నిందితుడు మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Bypoll : ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని KCR పిలుపు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870