అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య ఒప్పంద గడువు ముగియకముందే ఆయన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వుతో డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధించారు.ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా వ్యాపారాలకు అనుకూలంగా ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించడం లక్ష్యమని తెలిపారు. కొత్త సుంకాలు ఏడురోజుల్లో అమల్లోకి (New tariffs to come into effect in seven days) వస్తాయని పేర్కొన్నారు. 69 దేశాలపై 10 శాతం నుంచి 41 శాతం వరకు టారిఫ్‌లు విధించారు.

అత్యధిక సుంకం సిరియాపై
ఈ జాబితాలో సిరియాపై అత్యధికంగా 41 శాతం సుంకం విధించారు. అలాగే కెనడాపై 35 శాతం, భారత్‌పై 25 శాతం, తైవాన్‌పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 39 శాతం టారిఫ్ విధించారు.భారత్‌పై 25 శాతం సుంకం నిర్ణయించారు. ఈ నిర్ణయం రెండు దేశాల వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కొత్త సుంకాల జాబితా
కొన్ని దేశాలపై విధించిన టారిఫ్‌లు ఇలా ఉన్నాయి:
ఆఫ్ఘనిస్థాన్ – 15%
అల్జీరియా – 30%
బ్రెజిల్ – 10%
బంగ్లాదేశ్ – 20%
ఇరాక్ – 35%
లావోస్ – 40%
మయన్మార్ – 40%
శ్రీలంక – 20%
పాకిస్థాన్ – 19%
జపాన్ – 15%
అమెరికా వ్యాపారాలకు లాభమా?
ట్రంప్ నిర్ణయం అమెరికా తయారీ రంగానికి అనుకూలమని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కానీ పలు దేశాలు ప్రతిస్పందనగా కొత్త సుంకాలను విధించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ఉత్తర్వుపై అనేక దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కొత్త సుంకాల కారణంగా వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తం అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also : India vs England : బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్.. ఆదుకున్న కరుణ్