దేవాన్స్ నగరానికి దూరంగా రహదారిపై కారులో వెళుతుండగా ఒక్కసారిగా కారు నిలిచిపోయింది.
అదే దారిలో అనేకమంది వాహనాలపై ప్రయాణిస్తున్నారు.
అందరినీ ఆపి, దేవాన్స్పెట్రోలు తెమ్మని అర్ధించాడు. ఎవరూ అతన్ని పట్టించుకోకుండా శరవేగంతో దూసుకుని వెళుతున్నారు. వాహనాలు ఆపిన వారితో దేవాన్స్ మాట్లాడుతూ “అయ్యా! నా వాహనంలో ఇంధనం(fuel) అయిపోయింది.
నేను మీకు ధనాన్ని ఇస్తాను. దయచేసి ఆ డబ్బాలో ఇంధనం తీసుకుని వచ్చి నాకు సాయ పడండి”
అని అర్థించడం ప్రారంభించాడు. “మీరు ఏం మాట్లాడుతున్నారండీ? పెట్రోల్బం క్ ఇక్కడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లి వచ్చే సమయం(time) మాకు లేదు.
మా పనులన్నీ
నిలిచిపోతాయి. పైగా రాను పోను ఇరవై కిలోమీటర్ల ప్రయాణం. మా సాయవాహనంలో ఇంధనం అయిపోయి మాకు నష్టం కలుగుతుంది” అని ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పారు.
“అయ్యా! మీరు నష్టపోవలసిన అవసరం లేదు. రాను, పోనూ మీ వాహనానికి సరిపడా పెట్రోలు ధరను నేను చెల్లిస్తాను.

లేదా మీ వాహనంలోని పెట్రోలు కొంత నాకు ఇచ్చినా పెట్రోలు బంక్ వరకు వెళతాను” అని దేవాన్షి అందరినీ కోరాడు. ఏ ఒక్కరూ సాయం చేయకపోగా విసురుగా వెళ్లిపోయారు. కాసేపటికి ఆ వైపు నుండి ఒక పేద రైతు సైకిలు మీద వస్తున్నాడు.
దేవాన్షి అతడిని అడిగాడు. “బాబయ్యా! నేను సైకిలెక్కి వెళ్ళి ఈ డబ్బాలో పెట్రోలు తెస్తాను” అని డబ్బా తీసుకున్నాడు. పెట్రోలు బంకు పది కిలోమీటర్లు దూరం ఉంది కదా? సైకిల్‌పై వెళ్ళి వస్తారా?” ప్రశ్నించాడు దేవాన్.
మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎలా బాబయ్య. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి పెట్రోలు తస్తాను” అని బయలుదేరబోయాడు ఆ పేద రైతు.
“మీరు పెట్రోలు తేవలసిన అవసరం లేదు. నేను చాలా ధనవంతుడిని. నా భార్యా బిడ్డలు
రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

ప్రస్తుతం నేను ఏకాకిని, నా వద్ద ఉన్న ధనంతో మంచివారికి
సాయం చేయాలని నిర్ణయించాను. మీ మంచితనం నాకు నచ్చింది. ఈ డబ్బును తీసుకోండి” అంటూ లక్ష రూపాయల కట్టను బహుమతిగా పేద రైతుకు అందించి దేవాన్షా కారులో వెళ్ళిపోయాడు.
Read also: hindi.vaartha.com
Read also: Sibling Bond : తేడాలెందుకు?