బెంగళూరు శివార్లలోని నెలమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన క్లాస్‌మేట్ తండ్రి నుంచి నిరంతరంగా వచ్చిన బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ వేధింపులను తట్టుకోలేక 22 ఏళ్ల నర్సు భావన (Bhavana) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సమాజాన్ని షాక్‌కు గురి చేస్తూ, మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతోంది.భావన తుమకూరు జిల్లా గుబ్బి పట్టణంలోని గ్యారహళ్లి గ్రామానికి చెందిన యువతి. మైసూరులో నర్సింగ్ చదివిన ఆమె, చదువు పూర్తయ్యాక తుమకూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఈ కాలంలో ఆమె క్లాస్‌మేట్ తండ్రి నవీన్ (Naveen) అనే వ్యక్తి నుంచి మానసిక వేధింపులు ఎదుర్కొంది. నవీన్ తన కుమార్తె ఫోన్ ద్వారా భావన నంబర్‌ను పొందాడు. ఆ తరువాత తరచుగా ఆమెను సంప్రదిస్తూ, అనవసర ఒత్తిడి తెచ్చేవాడు.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
ఒక సందర్భంలో నవీన్ భావనను ధర్మస్థలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో కలిసి ఒక ఫోటో దిగాడు. ఆ ఫోటోను ఆధారంగా చేసుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలని బెదిరించడం ప్రారంభించాడు. “నన్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే నీ ప్రైవేట్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను” అని తరచుగా ఒత్తిడి తెచ్చేవాడని పోలీసులు చెబుతున్నారు.ఆ వేధింపులు భరించలేక భావన 15 రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన తర్వాత ఆమె తండ్రి నిందితుడిపై చేలూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె కోలుకుంది. పోలీసులు నిందితుడికి హెచ్చరిక జారీ చేసి బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ, ఫలితం లేకపోయింది. గురువారం భావన నేలమంగళలోని తన అత్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత శుక్రవారం తన అత్తతో ఉండటానికి ఆమె అక్కడికి వెళ్లింది. ఘటన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు నేలమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బెంగళూరు ఎందుకు “భారత సిలికాన్ వ్యాలీ” అని పిలుస్తారు?
ఐటీ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్టార్టప్‌లు ఎక్కువగా ఉండటం వల్ల బెంగళూరును భారత సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు.
బెంగళూరులో వాతావరణం ఎలా ఉంటుంది?
బెంగళూరులో సంవత్సరం పొడవునా మితమైన వాతావరణం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 28-35°C మధ్య ఉండగా, శీతాకాలంలో 15-20°C వరకు ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Read Also: IND vs ENG: మళ్లీ టాస్ ఓడిన టీమిండియా