తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఎర్రవెల్లిలోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రత్యేకంగా ఎమ్మెల్యేల అనర్హత (Disqualification of MLAs)అంశంపై ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భేటీ ప్రాధాన్యం
ఇటీవలే సుప్రీంకోర్టు తెలంగాణ (Telangana) లో పార్టీ మార్చిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. ఆ నిర్ణయాన్ని మూడు నెలల్లోపు వెలువరించాలని స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు బీఆర్ఎస్ పార్టీకి ఊరటనిస్తూ, రాజకీయంగా కీలక మలుపు తెచ్చింది. అదే కారణంగా కేసీఆర్ (KCR) అత్యవసరంగా పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయానికి గడువు నిర్ణయించడంతో, ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యం కానున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ అధికారిక ట్వీట్ – “సత్యమేవ జయతే”
సుప్రీంకోర్టు ఆదేశాలపై బీఆర్ఎస్ ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. “సత్యమేవ జయతే” అంటూ తక్షణమే ట్వీట్ చేస్తూ… బీఆర్ఎస్ తన వైఖరిని వెల్లడించింది. పార్టీలోకి దూసుకువచ్చిన పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇక శాశ్వత నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: TG By Elections: ఉప ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలి: కేటీఆర్