హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) పథకం హైదరాబాద్ లోనూ అమలు కానుంది. నగరంలో గుడిసెలు, తాత్కాలిక నివాసాలు ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే యాకూతురా, మలక్పేట, కంటోన్మెంట్ ప్రాంతాల ప్రజలు స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. జీ+3 లేదా జీ+5 విధానంలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించనున్నారు. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీకి 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరిమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టా త్మకంగా భావిస్తోంది. ఇప్పటివరకు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అవన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ఓ కొలిక్కి రావ డంతో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ (Revanth Government) భావిస్తోంది. ఇందుకోసం రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాలు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నాయి. నగరంలో గుడిసెలు, తాత్కాలిక నివాసాలు ఉన్న ప్రాంతాల్లో స్థలాలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చేందుకు అంగీకరించేలా స్థానికులతో అధి కారులు చర్చలు జరుపుతున్నారు. అంగీకరించని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ఒప్పించే ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు యాకూత్

గుడిసెలు, కంటోన్మెంట్లోని అంబేడ్కర్ నగర్ వాసులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో 222 ఇళ్లు నిర్మించే అవకాశ ముందని ఇందిరమ్మ ఇళ్ల రాకతో ఈ మురికి వాడలు కను మరుగవుతాయని అంటున్నారు. ముందుగా ఇక్కడే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 1486 ఉన్నాయి. వీటిలో దాదాపు సగానికి పైగా ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. అయితే పలు చోట్ల కొత్త మురికివాడలు వెలుస్తున్నాయి. ఈక్ర “మంలో అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులను ఇందిరమ్మ ఇళ్లకు స్థలం ఇచ్చేలా. ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Minister Narayana : సింగపూర్ లో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన-రేపు మలేషియాకు మంత్రి