సూర్యాపేట (Suryapet) జిల్లా నేరేడుచర్ల (Nereducherla) మండలంలో సంచలనం సృష్టించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సివిల్ వ్యవహారంలో పోలీస్ అధికారి జోక్యం చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఎస్ఐపై వేధింపుల ఆరోపణలు
ఇంజంవారి గూడెం గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ, నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ రవీంద్ర నాయక్ (SI Ravindra Nayak) అతడు సివిల్ విషయాల్లో జోక్యం చేసుకొని వేధిస్తున్నాడని, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన స్వప్న.
నిరసన.. మరింత ఉధృతమవగా
అధికారుల స్పందన కోసం ఎదురుచూసిన ఆమెకు ఎటువంటి సంతృప్తికరమైన స్పందన రాకపోవడంతో, ఆవేశంతో అక్కడికక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read also: Ranga Reddy: 40 ఏళ్ల వ్యక్తితో 13 ఏళ్ల బాలికకు వివాహం చేసిన తల్లి
Govt Hospital: ప్రభుత్వ హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలి