తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామిని మరింత దగ్గరగా (ఆలయంలోపల కులశేఖరపడి వద్ద నుండి) దర్శనం చేసుకునే అవకాశం ఉన్న శ్రీవాణి బ్రేక్ దర్శనాల టిక్కెట్ల జారీ, దర్శనం వేళల్లో మార్పు చేస్తూ టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1వతేదీ నుండి 15వతేదీ వరకు ఏరోజుకారోజు శ్రీవాణి బ్రేక్ దర్శనం టిక్కెట్లు జారీచేసి వారందరికీ సాయంత్రం 4.30గంటలకు దర్శనం కల్పించనుంది. ఈ ప్రయోగాత్మక మార్పు రేపటి నుండి(ఆగస్ట్ 1) అమలులోకి వస్తోంది. ఉదయం టిక్కెట్లు జారీని ప్రారంభించి అదేరోజు సాయంత్రం శ్రీవాణి బ్రేక్ దర్శనమ్ చేయించేలా నూతన విధానం ప్రయోగాత్మకంగా అమలుకానుంది.
అయితే ఇప్పటికే అక్టోబర్ నెలవరకు ఆన్లైన్లో శ్రీవాణి బ్రేక్ టిక్కెట్లు పొందిన భక్తులకు మాత్రం యధావిధిగా ఉదయం 10గంటలకే దర్శనానికి అనుమతినిస్తారు. రానున్న నవంబర్ నెల నుండి ఆన్లైన్, ఆన్లైన్ శ్రీవాణి భక్తులకు సాయంత్రం 4.30గంటలకు గోవిందుని దర్శనం కల్పిస్తారు. ఇప్పటికే ఈ దర్శనాలపై పలువురు భక్తుల నుండి అందిన అభిప్రాయాల మేరకు ఈ విధివిధానాలపై బుధవారం ఉదయం గోకులం విశ్రాంతి భవనంలో ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాధం, ఐటి జిఎం శేషారెడ్డి, ఎన్టీవిరామ్ కుమార్, అల్లంసురేంద్ర, డిఎఫ్ ఫణికుమార్నాయుడు, డిప్యూటీ ఇఒ వెంకటయ్య, ఐటి డిప్యూటీ జిఎం వెంకటేశ్వర్లునాయుడు, పిఆర్ ఒ నీలిమతో కలసి టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ విఎస్ ఒలు వెంకయ్యచౌదరి సమీక్షించారు. ఇప్పటికే ఆఫ్లైన్లో శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లు ఉదయం 8గంటల నుండే 900 తిరుమలలో, 100 టిక్కెట్లు రేణిగుంట విమానాశ్రయంలో జారీచేస్తున్నారు.
మరుసటి రోజు దర్శించుకో వడం వారం నుండి బుధవారం (Wednesday) వరకు తిరిగి శని, ఆదివారాల్లో నూ ఉదయం 10. 15గంటల నుండి మధ్యా హ్నం 12 గంటల వరకు, గురు వారం ఉదయం 7. 15 గంటల నుండి 12 గంటల వరకు, శుక్ర వారం 8.15 గంటల నుండి 12గంటల వరకు దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల నుండి డిమాండ్ ఉండటంతో ఆఫ్లైన్లో జారీఅవుతున్న వెయ్యిటిక్కెట్లను మరో 500వరకు పెంచే యోచనలో కూడా టిటిడి ఆలోచన చేస్తోంది. దీనివల్ల మరింతమంది భక్తులు సాపీగా స్వామివారిని అదేరోజు దర్శనం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేంకటేశ్వర స్వామిని డబ్బున్న ధనవంతులేగాక సామాన్యభక్తులు కూడా మరింత దగ్గరగా. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

ఏడుకొండల తరువాత ఇలాంటి భక్తుల కోసం 10,500 రూపాయలు చెల్లించి శ్రీవాణి బ్రేక్ దర్శనం టిక్కెట్లు విధానం అమలుచేస్తున్నారు. ఇందులో 10వేల రూపాయలు ట్రస్ట్కు,500 టిక్కెట్కు కేటాయిస్తారు. ఇప్పుడు అమలవుతున్న ఆన్లైన్ విధానం వల్ల కొండకు వచ్చిన భక్తులు మొదటిరోజు దర్శన టిక్కెట్లు లభించకుంటే ఆ క్యూలైన్లో నిలబడి టిక్కెట్లు అందుకుంటుండటం వల్ల కొందరు భక్తులు మూడురోజులు తిరుమలలో నిరీక్షించాల్సిన సమయం వస్తోంది. అంతేగాక ఆఫ్లైన్లో జారీచేసే 900 టిక్కెట్లకోసం భక్తులు ముందుగానే బారులుతీరి నిలబడి చివరకు వెనుదిరిగే పరిస్థితి ఉంది. ఇటీవలే తిరుమలలో అన్నమయ్యభవనం సమీపంలో అధునాతనంగా శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్ల జారీకౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఇప్పుడు ఏరోజుకారోజు దర్శన టిక్కెట్లు జారీచేస్తే భక్తులకు మరింత సులభంగా ఉంటుందని అదనపు ఇఒ వెంకయ్యచౌదరి భావించారు.
ఈ విషయంపై టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి ఇఒ శ్యామలరావు ఏకీభవించడంతో రేపటి నుండి శ్రీవాణి టిక్కెట్లు జారీ సమయం, దర్శన సమయంలో మార్పు చేశారు. తిరుమలలో ఉదయం 10గంటలకు శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లు -800 కౌంటర్లలో జారీచేయడం ప్రారంభిస్తారు. మొదటివచ్చిన భక్తులు మొదటిప్రాతిపాదికన అందుకోవచ్చు. ఇక రేణిగుంట విమానాశ్రయంలో 200 టిక్కెట్లు జారీ జరుగుతుంది. భక్తులు ఇబ్బంది పడకుండా ముందుగానే కౌంటర్ల వద్దకు చేరుకుని ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా చూడనున్నారు. ఏరోజుకారోజు శ్రీవాణి టిక్కెట్లు జారీకానున్నాయి. ఆదేరోజు సాయంత్రం 4.30గంటలకు వైకుంఠమ్ 1 క్యూకాంప్లెక్స్ వద్ద నుండి శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Income Tax : ఆదాయ పన్ను విభాగం చీఫ్ కమిషనర్‌గా అనిల్ కుమార్