బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారించారు. సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఆయన బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీల వివరాలు పరిశీలించినట్లు సమాచారం. ఆయన స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత మళ్లీ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేసిన ప్రకాశ్ రాజ్
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) “నేను బెట్టింగ్ యాప్స్ నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోలేదు. 2016లో ఒక యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశాను. ఆ తర్వాత అలాంటి యాప్స్‌కు ఎలాంటి ప్రమోషన్ చేయలేదు” అని స్పష్టం చేశారు. తన లావాదేవీలన్నీ అధికారులు పరిశీలించారని, ఏవీ అనుమానాస్పదంగా లేవని ఆయన చెప్పారు.
ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయనని హామీ
బెట్టింగ్ యాప్స్ కారణంగా సమాజంలో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని గుర్తించిన ప్రకాశ్ రాజ్ ఇకపై అలాంటి యాప్స్‌కు ప్రచారం చేయబోనని హామీ ఇచ్చారు. “ఇలాంటి అంశాల్లో ఇకపై నేను పాల్గొనను. సమాజానికి మంచి జరిగే పనుల్లో మాత్రమే ఉంటాను” అని అన్నారు. ఈ ప్రకటనతో బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
Read Also : Donald Trump : ట్రంప్ వ్యాఖ్యలను మోదీ ఖండించడం లేదు – రాహుల్