“వచ్చే వారం మూడు రోజులు పనికిరానమ్మగారూ!” పిడుగులాంటి విషయాన్ని రాగాలు తీస్తూ మరీ తెలిపింది పనమ్మాయి సీతాలు. ఆ మాటలకు వంట గదిలో టిఫిన్ తయారు చేస్తున్న లలిత ఒక్కసారి ఉలిక్కిపడింది.”ఆదేమిటే, పోయిన వారమే కదా నీ అక్క కూతురు పెద్దమనిషి అయ్యిందని రెండు రోజులు నాగాలు పెట్టావు. మళ్లీ ఏమొచ్చింది?” పోయినేడు జబ్బు చేసినప్పుడు మా చిన్నోడి తలనీలాలు సమర్పిస్తానని వెంకన్నకు మొక్కుకున్నానమ్మగారూ. నా పెనిమిటికి ఇప్పటికి కుదిరింది. రైలు టికెట్లు (Tickets) దర్శనం టికెట్లు అన్నీ ఏర్పాటు చేశాడు.
మా కుటుంబం నలుగురం వచ్చే బుధవారం తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుని శనివారం కల్లా వచ్చేస్తాం” వివరంగా చెప్పింది సీతాలు. ఏడుకొండలవాడి దర్శనానికి, అందులో మొక్కు చెల్లించుకోవడానికి అనేసరికి మరేం మాట్లాడలేకపోయింది లలిత. “సరేలే! నా తిప్పలేవో నేను పడతాను. మొక్కు కథ(story) భేషయిన ఆలోచన. దీనికి తటపటాయింపు ఎందుకు. సీతాలుతో డబ్బు
పంపించి, హుండీలో వేయించు. త్వరలో వీలు చూసుకుని మనిద్దరం స్వామి దర్శనం చేసుకుందాం” మెచ్చుకోలుగా అన్నాడు రవీంద్ర. ఒకవేళ డబ్బుకు ఆశపడి వాళ్ళు హుండీలో
వేయకపోతే!? ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా పదివేలు” తన మనసులోని సందేహాన్ని బయటపెట్టింది లలిత. ఛ. అలాంటి అనుమానాలు ఏవీ పెట్టుకోకు లలితా.. మొక్కు తీర్చుకోడానికి సమర్పించే ముడుపు కోసం ఏ మనిషీ కక్కుర్తి పడడు. అందులోనూ వడ్డీకాసులవాడి సొమ్ము”.
“నాకు తెలుసండీ.
కానీ పది వేలు అనేసరికి కొంచంజంకుగా ఉంది” మనుషుల మీద నమ్మకం ఉంచాలి లలితా. ఏ నూటికో కోటికో ఒకరిద్దరు తప్పితే మనుషులలో అధిక శాతం నీతి నిజాయితీ మీద నమ్మకం ఉన్నవాళ్లే, దానిని ఆచరిస్తున్నవాళ్ళే.
మనుషులు సహజంగా మంచివాళ్లే కానీ
మోసగాళ్ళు కాదు. మనసులో ఎటువంటి శంకలు పెట్టుకోకుండా సీతాలు ద్వారా ఆ పది వేల మొక్కు చెల్లించుకో” సుస్పష్టంగా చెప్పాడు రవీంద్ర. నమ్మకం చెల్లించుకుని రా.తర్వాత మాత్రం
మళ్ళీ అదనీ ఇదనీ నాగాలు పెట్టకూడదు” ముందు జాగ్రత్తగా తన కండిషన్లు ఏకరువు పెట్టింది లలిత, వాటి విలువ పనమ్మాయికి గరికపోచతో సమానమని తెలిసినా.
ఆ రాత్రి పడుకునేటప్పుడు భర్త రవీంద్రతో “వచ్చే వారం మన పనమ్మాయి సీతాలు తన కొడుకు మొక్కు తీర్చుకోడానికి తిరుపతి వెళ్తుంది. అది మొక్కనగానే నాకు నా మొక్కు గుర్తుకొచ్చింది. ఆర్నెల్ల క్రితం మన పెద్ద
మనవడు అనిల్‌కి అమెరికాలో ఆక్సిడెంట్ అయ్యిందంటే వాడు క్షేమంగా కోలుకుంటే శ్రీవారిని దర్శనం చేసుకుని హుండీలో పది వేలు వేస్తానని మొక్కుకున్నాను.

మనిద్దరం ఇప్పట్లో వెళ్ళడం ఎలాగూకుదరదు. కనీసం డబ్బయినా సీతాలుతో పంపించి హుండీలో వేస్తే ఎలాగుంటుందా? అని ఆలోచిస్తున్నాను” అంది లలిత. “ఈ రోజు సాయంత్రమే మా ప్రయాణం అమ్మగారూ. మధ్యాహ్నం మరోసారి వచ్చి అంట్లగిన్నెలు తోమేస్తాను” పొద్దుటే పనికి వచ్చిన సీతాలు లలితతో అంది.
“ఆదివారం పొద్దుట తప్పకుండా వస్తావు కదా?” తన సందేహం నివృత్తి చేసుకోడానికి మరోసారి
సీతాలుని అడిగింది లలిత. “ఎంత ఆలస్యమైనా తప్పకుండా వచ్చేస్తానమ్మగారు.
అంట్లగిన్నెలు
అలాగే ఉంచేయండి” లలితకి మరోసారి భరోసా ఇచ్చింది సీతాలు. పనైపోయాక ఇక వెళ్లానని తన
దగ్గరకు వచ్చిన సీతాలుతో “ఒక్కక్షణం ఉండవే” అంటూ లలిత బెడ్రూంలోకి వెళ్ళి తను కట్టిన
ముడుపు తీసుకుని తిరిగి వచ్చింది. ఇదిగో…! స్వామి దర్శనం చేసుకున్నాక గర్భగుడి పక్కనే ఉన్న హుండీలో ఈ ముడుపు నా పేరు మీద వెయ్యవే.
మా మనవడి కోసమని మొక్కుకున్నాను. ముడుపు జాగ్రత్త. చాలా డబ్బుంది. పదిలంగా నీ దగ్గరే ఉంచుకో. ఎవరికీ ఇవ్వకు. గుడిలో స్వామి వారి హుండీలోనే వెయ్యి” ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ముడుపు మూటను సీతాలుకు అందజేసింది లలిత. “అలాగేనమ్మగారు.
తప్పకుండా నేనే హుండీలో వేస్తా” అంటూ ముడుపు తీసుకుని లలిత దగ్గర వీడ్కోలు తీసుకుంది సీతాలు. ఉదయం ఆరు గంటలకి తిరుపతి చేరుకుంది సీతాలు కుటుంబం. కొండపైకి చేరుకునేసరికి దాదాపు ఎనిమిదయింది. శ్రీవారి ఆలయం ఎదురుగా వాణిజ్య సముదాయం దగ్గర భక్తుల సౌకర్యార్థం కట్టిన షెడ్లు చేరుకుని అక్కడే ఉన్న ఉచిత శౌచాలయంలో కాలకృత్యాలు అవీ తీర్చుకుని టిఫిన్ గట్రా కానిచ్చి పిల్లాడి తలనీలాలు సమర్పించుకోడానికి కళ్యాణ కట్ట చేరుకున్నారు కుటుంబమంతా.
ఏడుకొండల వాడికి తలనీలాలుసమర్పించి స్నానాలు కానిచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండయ్యింది. శ్రీవారి నిత్యాన్నదాన కేంద్రంలో భోజనాలు కానిచ్చి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం గేటు చేరుకునేసరికి సరిగ్గా ఒంటిగంటయింది. హమ్మయ్య, దేవస్థానం వారు సూచించిన సమయానికల్లా చేరుకోగలిగామని భార్యాభర్తలిద్దరు ఊపిరి
పీల్చుకున్నారు.
క్యూలో మూడు గంటల పాటు గడిపాక నాలుగు గంటల ప్రాంతంలో దేవాలయం లోపలి వెండి వాకిలి చేరుకున్నారు. అప్పటి వరకు ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్న
క్యూ వెండి వాకిలి తరువాత ఒక్కసారిగా అందరినీ గుంపుగా వదలడంతో అక్కడంతా గందర
గోళంగా తయారై తోపులాటలు మొదలయ్యాయి.
ఆ తోపులాటలో పిల్లలు ఎక్కడనలిగిపోతారేమోనని సీతాలు, ఆమె భర్త పిల్లల్ని తమ భుజాల మీద కూర్చోబెట్టుకుని ముందుకు సాగారు. అలా ఒకరి నొకరు తోసుకుంటూనే గర్భాలయం ప్రవేశించి స్వామిని రెండు క్షణాలపాటు దర్శించుకుని
బయట పడ్డారు. ఆ రెండు క్షణాల దర్శనానికే వారి తనువులు పులకరించి పోయాయి.దైవ దర్శనం చేసుకున్న ఆనందం మొహాల్లో స్పష్టంగా వెల్లి విరుస్తుండగా సీతాలు కుటుంబం గుడి ఆవరణలో ఇస్తున్న ప్రసాదం తిని గుడి బయటకు వచ్చారు. మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి లడ్డూలు కొని తీసుకొస్తాను” అని సీతాలు భర్త రాములు వెళ్లబోయాడు.

అంతలో సీతాలు గట్టిగా అరిచింది
“అయ్యో మావా! అసలు విషయం మరిచిపోయాను”. రాములు కంగారు పడుతూ “ఏం మరచి పోయావే?” అనడిగాడు. అదే మావా, అమ్మగారిచ్చిన ముడుపు హుండీలో వెయ్యడం మరచి
పొయ్యాను. ఇప్పుడెలా?” దాదాపు ఏడిచినంత పని చేసింది సీతాలు. ఓస్! దానికేనా ఇంత కంగారు. ఆ మెట్ల పైన ఇంకో హుండీ ఉందిలే. అక్కడేయవచ్చు.
లేదా వరాహ స్వామిగుడిలో వెయ్యవచ్చు”.
“కాదు మావా. అమ్మగారు మరీ మరీ చెప్పారు.. లోపల గర్భగుడి పక్కనే ఉన్న హుండీలోనే
వెయ్యమని. పోనీ ఒకసారి ఆ పోలీసాయనను ఆడగరాదూ. నన్ను హుండీ దాకా పంపిస్తాడేమోనని”.
సీతాలు బాధ చూడలేక దేవాలయం ప్రధాన ముఖద్వారం దగ్గర ఉన్న ఒక వాలంటీర్ తో జరిగిన
విషయం చెప్పి సీతాలును లోపలికి పంపడానికి అనుమతి కోరాడు రాములు. అతను ఎట్టి పరిస్థితులలోనూ అది కుదరదని చెప్పి “కావాలంటే గుడిలో పనిచేసే వారికెవరికైనా ముడుపు ఇచ్చి
హుండీలో వెయ్యమని చెప్పవచ్చు” అన్నాడు.
అదే విషయం సీతాలుతో చెబితే అమ్మో! ఇంకొకరికి ఇవ్వడమే. లలితమ్మగారు నామీద ఎంతో నమ్మకముంచి హుండీలో వెయ్యమని ఇచ్చారు. అది ఇంకొకరికి ఇవ్వడమే!” అంట పని ఆదివారం పొద్దుట తప్పకుండా వస్తావు కదా?” తన సందేహం
నివృత్తి చేసుకోడానికి మరోసారి సీతాలుని అడిగింది లలిత. ఎంత ఆలస్యమైనా తప్పకుండా వచ్చేస్తానమ్మగారు. అంట్లగిన్నెలు అలాగే ఉంచేయండి” లలితకి మరోసారి భరోసా ఇచ్చింది
సీతాలు. చేయడానికి ససేమిరా ఒప్పుకోనంది. మరేం చేద్దామే?” ఏం చేయాలోతోచక అయోమయంగా చూశాడు. రాములు. “ఒక పని చేద్దాం మావా. నువ్వు పిల్లల్ని తీసుకుని పైన షెడ్డు దగ్గరకు వెళ్లిపో, నేను స్వామి దర్శనం మరోసారి చేసుకుని, హుండీలో ముడుపు వేసి రాత్రికి నిన్ను కలుస్తాను” అంది. ఇప్పుడా! ధర్మ దర్శనం చేసుకోవాలంటే కనీసం ఎనిమిది గంటల సమయమైనా పడుతుంది. దర్శనం చేసుకునేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది.
పొద్దుటి నుండి నీకసలువిశ్రాంతే లేదు.ఇప్పటికే బాగా అలసిపోయున్నావు. కష్టమవుతుంది. బాగా ఆలోచించుకో” అన్నాడు.
రాములు. కష్టమేమీ లేదు మావా. నేను వెళ్లగలను. అక్కడే క్యూ కంపార్టుమెంట్లలో విశ్రాంతి
తీసుకుంటానులే. మీరెళ్లండి” దృఢ నిశ్చయంతో అంది సీతాలు. భర్తనీ, పిల్లల్నీ పంపించేసి
తను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ప్ర వేశ ద్వారం దాకా నడుచుకుంటూ వెళ్ళి సర్వదర్శనం క్యూలో కలిసింది సీతాలు. దేవస్థానం వారు సరఫరా చేసిన పాలు తాగి, ఏడుకొండలవాడి నామస్మరణ
చేసుకుంటూ దాదాపు ఏడు గంటలు క్యూలో సమయం గడిపాక రాత్రి పన్నెండు గంటలకు దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగలిగింది సీతాలు.

ఈసారి మధ్యాన్నం మాదిరి రద్దీ ఏమీ
లేదు. జనం పల్చగా ఉండటం వల్ల గర్భగుడిలో కూడా ఎవరు తొందర పెట్టకుండా నిదానంగా స్వామిని దర్శనం చేసుకొనిచ్చారు. కళ్లార్పకుండా స్వామి వారి దివ్య విగ్రహాన్ని తనివితీరా చూసుకుంది సీతాలు. అనుకోని ఆ అదృష్టానికి సీతాలు మనసు ఉప్పొంగిపోయింది. ఏ జన్మలో
చేసుకున్న పుణ్యమో అనుకునిమురిసిపోయింది. ఈ పర్యాయం మరచిపోకుండా లలితమ్మగారు
ఇచ్చిన పది వేల రూపాయల ముడుపు, దాంతో కలిపి తన దగ్గరున్న వంద రూపాయలు
నోటు హుండీలో వేసి భక్తిగా వెంకన్నకు నమస్కరించుకొంది.
“ఏమే సీతాలూ! దర్శనం
ఎలా జరిగింది” ఆదివారం ప్రొద్దుటే పనికి వచ్చిన సీతాలుని అడిగింది లలిత. “మీ దయ వల్ల చాలా బాగా దర్శనం జరిగింది అమ్మగారు. ఒకసారి కాదు.. రెండు సార్లు దర్శనం అయింది అమ్మగారూ” ఎంతో సంబరంగా అంది సీతాలు. నేనేం చేశానే?” సీతాలుమాటలు అర్థమవక కొంచం
తికమక పడుతూ అడిగింది లలిత. తిరుమలలో జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు
వివరంగా లలితకి చెప్పింది సీతాలు. చివరగా “అమ్మగారూ! మొదటిసారి దర్శనానికి వెళ్ళినప్పుడు మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనమైనా అంతా గడబిడగా, తొక్కిసలాడుకుంటూ దర్శన
మయింది.
రాత్రి రెండోసారి మీకోసమని వెళ్లినప్పుడు కొంచం ఆలస్యమైనా ఎంతో సాఫీగా, హాయిగా,
సంతృప్తిగా స్వామివారి దర్శనం అయింది” ఎంతో ఆనందపడిపోతూ అంది సీతాలు. సీతాలు చెప్పిన మాటలు విని అవాక్కయింది లలిత. తనకి ఇచ్చిన మాట పూర్తి చెయ్యడం కోసం సీతాలు ఎంత శ్రమ పడింది. అదే తను సీతాలు స్థానంలో ఉంటే అంత కష్టపడేదా? లలిత చెవుల్లో భర్త చెప్పిన మాటలు గింగురుమన్నాయి మనుషులు సహజంగా మంచివాళ్లు లలితా. మనం మనుషుల మీద నమ్మకం ఉంచాలి”. తన కళ్ల ముందరే సీతాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు మేరు పర్వతం లాగా పెరిగిపోయిన భావన కలిగింది లలితకు.
Read also: hindi.vaartha.com
Read also: Mother’s Unconditional love:కన్న ప్రేమ