వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ Priyanka Gandhi లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చర్చలో మాట్లాడుతూ ఆమె ప్రధాన ప్రశ్నలు లేవనెత్తారు. శత్రువులు వెళ్ళలేని పరిస్థితుల్లో యుద్ధాన్ని ఎందుకు ఆపారో వివరించాలన్నారు.ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, నాయకత్వం అంటే కేవలం క్రెడిట్ తీసుకోవడం కాదని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం బాధ్యత వహించగల ధైర్యం అవసరమని చెప్పారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.ప్రధానమంత్రి మోదీ యుద్ధంపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు తెలియజేయలేదని ఆమె అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటిది తొలిసారి జరిగిందని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపిన కారణం ఎందుకు ప్రజలకు చెప్పలేదని ప్రశ్నించారు.

నెహ్రూ, ఇందిరా పేర్లు ప్రస్తావన
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ గురించి అమిత్ షా మాట్లాడారని ప్రియాంక అన్నారు. కానీ యుద్ధాన్ని అకస్మాత్తుగా ఎందుకు నిలిపివేశారో సమాధానం ఇవ్వలేదని విమర్శించారు.కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం విడ్డూరమని ఆమె అన్నారు. దేశ గౌరవానికి ఇది మచ్చ అని వ్యాఖ్యానించారు.
బైసరన్ వ్యాలీ ఘటనపై ప్రశ్నలు
బైసరన్ వ్యాలీకి వేలాది మంది వస్తారని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రియాంక ప్రశ్నించారు. నిఘా వ్యవస్థ ఇంత పెద్ద ముప్పును గుర్తించలేదా అని నిలదీశారు.పాకిస్థాన్ ఇంతటి దాడి చేస్తుందని మన నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయని ఆమె అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అని తీవ్రంగా విమర్శించారు.
బాధ్యత ఎవరిది?
ఈ దాడికి బాధ్యత ఎవరు వహిస్తారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. గతం గురించి మాట్లాడేవారు, ప్రస్తుతం జరిగిన ఘటనలపై ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించారు.ప్రియాంక గాంధీ ప్రసంగం లోక్‌సభలో హోరెత్తించింది. ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
Read Also : Stock Market : భారత స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్