Cucumber Dosakaya Pachadi:కావలసిన పదార్థాలు
- కీరా దోసకాయలు – 2
- చిన్న కొబ్బరి ముక్కలు లేదా కోరిన కోరు – ఒక కప్పు
- తగినంత ఉప్పు
- నిమ్మకాయ – ఒకటి
- కారాన్ని బట్టి పచ్చి మిరపకాయలు – 4, 5
- సుమారు ఒక కప్పు తరిగిన కొత్తిమీర తురుము
- చెంచాడు మినపప్పు
- కొంచెం ఆవాలు

తయారు చేసే విధానం:
కీరా దోసను చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరి(coconut),ఉప్పు, కొత్తిమీరను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని తరిగి కీరాముక్కలలో ఈ ముద్దని కలుపుకుని నిమ్మరసాన్ని పిండుకోవాలి. కావలసిన వారు మినప్పుప్పు, ఆవాలు కొంచెం నూనె (oil) తో పోపు వేసి కలుపుకోవచ్చు. లేకపోయినా బాగానే ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

Read also: hindi.vaartha.com
Read also: Sweet Potato Boorelu:చిలకడదుంప బూరెలు