వీడ్కోలు
ఉద్యోగానికి వీడ్కోలు పలికాక
శరీరం బద్దకానికి
స్వాగతం పలుకుతుంది.
సమయానికి అందే టీ
కాస్త ఆలస్యమవుతుంది
రోజు పెట్టే భోజనంలో
కొంచెం కొంచెం ప్రేమ తగ్గి
రుచి పూర్తిగా కోల్పోతుంది.
ఆలోచించాలి గాని
వీడ్కోలు కృత్రిమమైనదేమీ కాదు
సహజమైనదే
అయినా..
వీడ్కోలు ఉద్యోగానికి కానీ
జీవితానికి కాదుగా.
ఆస్వాదించే మనసునిండాలి గాని
జీవితమెప్పుడూ రుచిగానే ఉంటుంది.
జీవితమంతా
నువ్వు అనుకోవడంలోనే ఉంది
ఎలా అనుకుంటే అలా
రోండా బర్న్ “రహస్యం” ఎవరైనా
అప్లై చేసుకోవచ్చు.
మనసుండాలి కానీ
మలిదశ కూడా
మహాద్భుతంగా వెలుగొందుతుంది.

ఆలోచనుండాలిగానీ
నీ జీవితానుభవంతో
కొత్త తరానికి నువ్వు
దారిదీపమవ్వచ్చు.
కవిగానో రచయితగానో పక్వానికొచ్చి
చెడు ఆలోచనల నుండి
సమాజాన్ని మంచి వైపు దారి
మళ్లించవచ్చు.
తపన ఉండాలి కానీ
వెన్నుపూస వంగేదాకా
ఆలోచనల తరంగాలతో
ప్రతిరోజూ నువ్వు కొత్తగా
ఉదయించవచ్చు.
వీడ్కోలు ఉద్యోగానికే కానీ
జీవితానికి కాదు.

మనసు తెరలు
కుశల ప్రశ్నల పయనంలో
మనసు మమతల పలుకరింతలు
చిగురింతలౌతాయి.
అవి అందమైన కొత్త రూపం
సంతరించుకుంటాయి.
తలపులు తలుపుల తెరలు తీసి
జాలువారే వెన్నెల రేఖల సోనలై
ప్రేమానుభూతికి
లోనౌతాయి మదివాకిట్లో ఒక్కోసారి.
అంతరాలలో దాగిన
స్నేహతత్వం పెల్లుబికి
కరుణ దయార్ద్ర రసాలు
కురిపిస్తుంది మనసు.
స్నేహానికి అర్రులు చాచే
మనోనేత్రాలు క్షణ కాలమైనా
స్వచ్ఛమైన చెలిమి చేతులు
కలుపుతానంటాయి.
చూడాలని ఉంది..
మా ముంగిట్లో విరిసిన
మల్లెపందిరిపై
ప్రతి రోజూ సాయంత్రం వేళలో
ఎన్నో పిచ్చుక
మిత్రులు
చేరేవి.
నేను
పూలకోసం
వెళ్లినప్పుడు
చూడాలని
వాటి భాషలో అవి మాట్లాడుకునే
కిలకిలారావాలు మదికి హాయినిచ్చేవి.
అదే సమయంలో బిలబిలమంటూ
ఇరుగు పొరుగు పిల్ల తెమ్మెరలన్నీ
ఆ పందిరి కింద చేరి అల్లరి చేసేవి
పూచిన ఆ మల్లెమొగ్గలు కావాలని
ఈ చిన్నారి పిల్లమొగ్గలు
అడుగుతుంటే
వారికీ ఆ పూల పరిమళం
పంచేదాన్ని.
కొమ్మ కొమ్మల్లో ఆ
పసిప్రాయం
దోబూచులాడుతుంటే
నా హృదయం కూడా
వారితో
పాటు కాసేపు ఆడుకుంటూ
ఆ దాగుడుమూతల్లో నేనే
దొరికిపోయినంత
సంబరపడిపోయేదాన్ని.

ఇటీవలే వచ్చిన ఓ చరవాణి బూచోడు
బాల్యాన్ని వాడి చెరలో
బంధించేసాడు
ఆ పసిమనసులను పూర్తిగా
తనవైపు తిప్పుకున్నాడు
స్వేచ్ఛగా తిరిగే ఆ సీతాకోకచిలుకలను
మళ్ళీ
ఇంతవరకూ
నేను
ప్రతీ రోజూ నా చూపులు
వారికోసం వెతుకుతూనే ఉన్నాయి.
ఈ సెల్ టవర్లతో పక్షుల కబుర్లు
కూడా కనుమరుగైపోతున్నాయి
ఇప్పుడు టచ్ స్క్రీన్లపై మునివేళ్ళ
సవ్వడి తప్ప
చిరు పలకరింపులు, గువ్వల ఊసులు
లేవు
పసితనం, పక్షితనం మళ్ళీ రెక్కలు
విప్పితే
నా కనులారా చూడాలని వుంది!
Read also: hindi.vaartha.com
Read also: Love Pain Telugu Quotes: పున్నమి వెలుగు