విజయవాడ : లూలూ కంపెనీకి విలువైన ప్రభుత్వ, ఆర్టీసి భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలని సిపిఐ (యం)రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివా సరావు ఈ అంశంపై ఓప్రకటన విడుదల చేశారు. విశాఖలో 13.83 ఎకరాలు ప్రభుత్వ భూములను, విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళజాతి సంస్థ లూలూకి కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ (యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. లులును ప్రోత్సహిం చడమంటే వేలాది మంది చిన్న వ్యాపారులను, లక్షలాది మంది ఉపాధిని దెబ్బకొట్టడమేనన్నారు. ఆర్టీసీ, ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని నాశనం చేయటం తగదు అని చెప్పారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములను విజయవాడ లోనూ, అలాగే విశాఖలోని ప్రభుత్వ భూము లను లూలూ మాల్ కోసం కేటాయించడం సరికాదు అని అన్నారు. నామమాత్రపు లీజుతో 99 సంవత్సరాలపాటు లీజుకి ఇవ్వటం అంటే ఆ విలువైన భూములను ఆయా సంస్థలకు ఉచితంగా కట్టబెట్టడమే నన్నారు.

ఇప్పటికే చిన్న, మధ్య తరగతి వ్యాపారులు (Merchants) సంక్షోభంలో ఉన్నారని తెలిపారు. రిటైల్ వర్తక రంగంలోకి బడా కంపెనీల ప్రవేశంతో చిన్న, మధ్యతరగతి వ్యాపారరంగం ఇప్పటికే దెబ్బతిన్నదని, లూలూ వంటి అంతర్జాతీయ (International) కంపెనీలతో పూర్తిగా నాశనమవుతుంది అని అన్నారు. బడా కంపెనీలకు రాయితీలు ఇస్తున్న పాలకులు, చిన్న, మధ్య తరగతి వ్యాపారులపై పన్నులు పెంచుతున్నారు, వేధిస్తున్నారనీ.. ఫలితంగా అనేక వ్యాపార సంస్థలు మూతపడు తున్నాయని, ఉపాధి దెబ్బతింటున్నదని అన్నారు. ఈ తరుణంలో చిన్న, మధ్యతరగతి వ్యాపా రులను దెబ్బతీసే రీతిలో లూలూ మాల్‌కు కారు చౌకగా భూములు పందేరం చేయడం గర్హనీయమన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరా లోచన చేసి, జీవోని రద్దు చేయాలని, ప్రభుత్వ, ఆర్టీసీ స్థలాలను కాపాడాలని, చిన్న, మధ్య తరగతి వ్యాపారులను రక్షించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Festival : సెప్టెంబర్ 22 నుంచి శరన్నవరాత్రి దసరా వేడుకలు