టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), భారతదేశంలో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ, 2026 ఫైనాన్షియల్ ఇయర్‌లో సుమారు 2% లేదా 12,200 ఉద్యోగులను తొలగించనుందని ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రధానంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావితం చేయబోతుంది. వీరు ఎక్కువ కాలం సేవలలో ఉన్నవారు, పాత విధానాల ప్రకారం పని చేసే వారు ఎక్కువగా వేటు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఈ లేఆఫ్స్ (Layoffs)ప్రకటన అనంతరం సంస్థ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. కొత్త ఉద్యోగ నియామకాలను నిలిపివేసినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో సీనియర్ లెవెల్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా వార్షిక వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లకు కూడా పుల్ స్టాప్ పెట్టినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.

అంతేకాదు, బెంచ్‌పై నియమిత కాలం కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని కూడా తొలగించే ప్రక్రియను మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఉద్యోగులు 35 రోజులకు మించి బెంచ్‌పై ఉండకూదనే నియమాన్ని టీసీఎస్ (TCS)అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక మధ్యస్థ, సీనియర్ స్థాయి ఉద్యోగుల తొలగింపు ద్వారా టీసీఎస్‌కి ఏటా 300 నుంచి 400 మిలియన్ డాలర్లు అంటే రూ.2,400 కోట్ల నుంచి రూ. 3,600 కోట్ల వరకూ ఆదా అవుతుందని ఓ సీనియర్ ఐటీ విశ్లేషకుడు అంచనా వేశారు.
కృత్రిమ మేథ ప్రభావం
కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుంటున్నాయి. భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్((TCS)) తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉండక తప్పదని ఆయన అన్నారు. ఉద్యోగుల సంఖ్యను ఎందుకు తగ్గించవలసి వస్తోందన్న ప్రశ్నకు యావత్ ఐటీ పరిశ్రమ మార్పు చెందుతున్నదని, పని చేసే విధానాలు మారుతున్నాయని ఆయన బదులిచ్చారు. 2025 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.13 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2 శాతం మంది అంటే సుమారు 12,200 మంది ఉంటారు. లేఆఫ్‌లు జూనియర్ లెవెల్‌లో కాకుండా మిడిల్ మేనేజ్‌మెంట్, సీనియర్ లెవెల్స్‌లో అధికంగా ఉంటాయని కృతివాసన్ స్పష్టం చేశారు.
టిసిఎస్ దేనికి ప్రసిద్ధి చెందింది?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ-ప్రముఖ సంస్థలకు ఎంపికైన డిజిటల్ పరివర్తన మరియు సాంకేతిక భాగస్వామి . 1968లో స్థాపించబడినప్పటి నుండి, TCS ఆవిష్కరణ, ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు కస్టమర్ సేవ యొక్క అత్యున్నత ప్రమాణాలను నిలబెట్టింది.
టిసిఎస్ సీఈఓ జీతం?
కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో కృతివాసన్ మొత్తం జీతం 4.6% పెరిగి రూ.26.5 కోట్లకు చేరుకుంది. 2023లో TCSలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పాత్రను చేపట్టిన కృతివాసన్ మొత్తం జీతం గత సంవత్సరం రూ.25.45 కోట్ల నుండి పెరిగింది.
టీసీఎస్ అత్యధిక వేతనం?
TCS లో అత్యధిక జీతం ₹50.0 లక్షలు. టాప్ 10% ఉద్యోగులు సంవత్సరానికి ₹30.0 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తారు. టాప్ 1% ఉద్యోగులు సంవత్సరానికి ₹49.4 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: RBI : ఆర్బీఐకి తలనొప్పిగా మారిన ఈ భారీ డిపాజిట్లు!