సికింద్రాబాద్‌లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ (Clinic cheating) పేరుతో నడుస్తున్న ఓ స్పెర్మ్ డోనేషన్ కేంద్రం వెనుక భయంకరమైన మోసం బయటపడింది. డాక్టర్ నమ్రత (Dr. Namrata) తో సహా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

బిర్యానీ, మద్యం.. రూపాయల ప్రలోభాలతో ‘దాతలు’ సెట్
బిచ్చగాళ్ల (beggars) కు బిర్యానీ, మద్యంతో ఆశ చూపడం, చదువుకున్న వారికైతే రూ. 1000 నుంచి 4 వేలు వరకూ చెల్లించి మహిళల నుంచి అండాలు సేకరించేందుకు మాత్రం ఒక్కసారి రూ. 20,000 నుండి రూ. 25,000 వరకు చెల్లించారని సమాచారం.
సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు ఆ దాతలు బాగా చదువుకున్నవారై, మంచి తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు కానీ ఈ దందా నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు, అడ్డాకూలీల వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నారు.
నిబంధనల ప్రకారం వినియోగ పరిమితి
ఒక దాత నుంచి గరిష్ఠంగా 25 సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించవచ్చు. అంతేకాదు, ఒకే మహిళకు ఒకసారి మాత్రమే గర్భధారణ కోసం దాత వీర్యాన్ని వినియోగించాలి. అదే దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని అనేక మహిళలకు, పునరావృతంగా వాడడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.
దాతకు ఉండాల్సిన వయోపరిమితి
స్పెర్మ్ దాతగా ఎంపికయ్యే వ్యక్తి వయస్సు కనీసం 21 ఏళ్లుండాలి. గరిష్ఠంగా 55 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ వయస్సు పరిమితి శారీరక పరిపక్వత, జన్యు స్థితి, జీవకణాల నాణ్యత ఆధారంగా నిర్ణయించబడింది.
స్పెర్మ్ ఏజెంట్ల పథకం: అవసరమైతే బిర్యానీ, లేకపోతే కొద్దిపాటి డబ్బు
స్పెర్మ్ ఏజెంట్లు ప్రత్యేకంగా బిచ్చగాళ్లు, రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకున్నారు. వారిని వారానికి ఒక్కసారి క్లినిక్‌కు రప్పించి, మద్యం లేదా బిర్యానీ ఇస్తామంటూ బలవంతంగా వీర్య సేకరణకు ఒప్పించేవారు. కొన్ని సందర్భాల్లో వారికి ₹500 నుంచి ₹1000 వరకు చెల్లించారట.
మహిళల టార్గెట్: అండాలు ఇచ్చినందుకు భారీ డబ్బు
తమకు తెలిసిన యువతులను క్లినిక్‌కు తీసుకొచ్చి, అండాలు సేకరించే విధంగా ఒప్పించేవారు. మహిళలకు ఇది శారీరకంగా కష్టంగా ఉండే పని కాబట్టి, ఒక్కసారి అండాల సేకరణకు ₹20,000 నుంచి ₹25,000 వరకూ నగదు చెల్లించేవారని తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Crime: పదోతరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన స్కూల్ ప్రిన్సిపాల్