Listen to your mother: ఒక అడవి. అందులో అన్ని రకాల జంతువులూ ఉండేవి. జింక నోటితో కొన్ని ఆకులు తెచ్చి “నీకు ఆటలు ఎక్కువయ్యాయి నువ్వు పెరిగి పెద్దయ్యావు. నీ ఆహారం(food)
నువ్వే సంపాదించుకోవాలి. చెట్ల కొమ్మలపైన చూడు రెక్కలు వచ్చిన పక్షులు ( birds) ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటున్నాయో!” అని తన బిడ్డ జింక పిల్లకు చెప్పింది.
అమ్మ మాటలు జింక పిల్లకు నచ్చలేదు. అక్కడ నుండి వెళ్లిపోయింది. అలా ఆకలితో పచ్చటి ఆకుల కోసం ముందుకు సాగింది.
జింక పిల్లను నక్క చూసింది. ఈ రోజు ఎలాగైనా ఈ జింక పిల్లను ఆరగించాలి అని ఎదురెళ్లి “ఎక్కడికి వెళుతున్నావు?” అని అడిగింది. అమ్మ కోప్పడ్డ విషయం చెప్పింది జింకపిల్ల. “అమ్మలంతా అంతే! ఆడుకోనివ్వరు. నీకు పచ్చటి ఆకులు దొరికే చోటు చూపిస్తాను.. పద” అని నక్క, జింకపిల్లను తాటి చెట్టు కింది నుంచీ తీసుకెళ్లింది.

చెట్టు పైన తాటి పండులోని ముంజలను ఒలిచి తింటూ చూసిన కోతి తన బలమంతా ఉపయోగించి తాటి పండ్ల గుత్తిని తెంపి నక్క మీద విసిరేసింది. అంతే! నక్క నడ్డి విరిగింది. “కుయ్యో.. మొర్రో” అంటూ అక్కడ నుండి పరుగు తీసింది.
కోతి కిందికి దిగి వచ్చి “నక్క నిన్ను పులి దగ్గరకు తెసుకెళ్లడానికి ప్రయత్నించింది. అసలు ఇక్కడికి ఎందుకొచ్చావు?” అని అడిగింది కోతి. “అలాగా మామా! నాకు అది తట్టనే లేదు” అని, అమ్మ గురించి చెప్పింది.

“అమ్మ మాటలు సద్ది మూటల్లాంటివి. తప్పక వినాలి పద” అని జింక వద్దకు తెసుకెళ్లింది కోతి.
“అమ్మా! కోతి మామ నన్ను కాపాడడమే కాకుండా మంచి మాటలు చెప్పింది.. ఇక నుండి నీ మాటలు వింటాను నీతో వచ్చి ఆహారం సంపాదించుకుంటాను అని అంది జింకపిల్ల. జింక కోతికి కృతజ్ఞతలు చెప్పింది.
Read also: hindi.vaartha.com
Read also: Successor to the business:వ్యాపార వారసుడు