విజయవాడ : ఏపీలో 2029 నాటికీ 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన (Renewable energy) సామర్థం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరో వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఆయనకు వివరిం చారు. ఇందుకనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2024ను ప్రకటించామన్నారు. రెన్యూ, సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభిం చాయని తెలిపారు. ఏపీలో పెద్దఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని లోకేశ్ (Lokesh) సైమన్ టాన్ ని కోరారు.
అదేవిధంగా అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవరో వోల్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఐటీఐలో రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కు సహకారం అందించాలని విజప్తి చేశారు. వీటిపై సైమన్ టాన్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో ఎంపిక చేసిన ఒక ఐటీఐలో రెన్యువబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఎవరో వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ అంగీకారం తెలిపారు. తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో యూనిట్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు. ఆనంద్ స్టాన్లీతో లోకేశ్ సమావేశం దక్షిణాసి యాలో ఎయిర్బస్కు డెడికేటెడ్ మెయిం టెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ హబ్గా ఏపీ మారే అవకాశ ముందని మంత్రి లోకేశ్ అభిప్రాయ పడ్డారు.
విమానయాన భాగస్వాములకు సమ ర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఆంధ్రప్రదేశ్ తో కలిసి పని చేయాల్సిందిగా కోరారు. సమగ్ర ఎంఆర్ఓ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం సింగ పూర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యా లను కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు లోకేశ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాది స్తున్న ఎంఆర్ హబ్ భారతీయ విమానయాన సంస్థలకు ఫెర్రీ సమయం, ఖర్చులను తగ్గించడ మేగాక, విమాన లభ్యతను మెరుగుపరుస్తుందని లోకేశ్ తెలిపారు. దీనివల్ల పొరుగు దేశాలలోని విమాన సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ ఎంఆర్ హబ్ అభివృద్ధి చెందుతుం దన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సౌకర్యాలను చూసేందుకు ఒకసారి రాష్ట్రాన్ని సందర్శించాల్సిం దిగా లోకేశ్ ఆనంద్ స్టాన్లీని ఆహ్వానించారు.
గత ఐదేళ్ల విధ్వంస పాలన చూశాక ఏపీని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకొచ్చారని గుర్తు చేశారు. అందుకే ఏ దేశం వెళ్లినా తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రవాసాంధ్రులు కృషి చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల ఏపీ ఊపిరి తీసుకుంటోందన్నారు. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్ లో పర్యటిస్తారని చెప్పారు.
ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సహకరి స్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. అనంతరం వాలంటీర్లను అభినందించిన లోకేశ్ వారితో ఫొటోలు దిగారు.

Read Hindi News : hindi.vaartha.com
Read also : BC Welfare : బిసిలకు పెద్దపీట వేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదే