చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నది. కరోనా మహమ్మారితో అనేకుల గుండెబలహీనమైపోతున్నది. ప్రాథమిక పాఠశాల చదివే పిల్లల దగ్గర నుంచి, కాలేజీ చదువుకునే వారు గుండెపోటు (heart attack) తో,హఠాన్మరణానికి గురవడం ఆందోళన కలిగించే విషయం. ఎంతో భవిష్యత్తు కలిగి, తమను ఆదుకుంటారనే,గంపెడు ఆశతో ఉన్న తల్లిదండ్రులకు గుండెకోతలే మిగులుతున్నాయి. తమకు తలకొరిపెట్టాల్సినవారే తమ కళ్లముందు మరణిస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేదు.
ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేదు
తాజాగా నాగోల్ లోని స్టేడియంలో షటిల్ ఆడుతున్న 25ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. ఒక్కసారిగాగుండెపోటు రావడం కుప్పకూలిపోయాడు. ఆ యువకుడి పేరు రాకేష్. దీంతో తోటివారు హుటాహుటిగా ఆస్పత్రికి,తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా (Khammam District) తల్లాడ మాజీ ఉపసర్పంచ్ గుండ్లవెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్ (25) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.ఎదిగొచ్చిన కొడుకు హఠాత్తుగా చనిపోవడంతో రాకేష్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.ఆధునికఆహారనియమాలు, సరైన శారీరక శ్రమ లేకపోవడం, అప్పటికే గుండెకు సంబంధించిన వ్యాధులే గుండెపోటుకుకారణాలు అంటున్నారు వైద్యనిపుణులు. శరీరంలో కొవ్వులేకుండా చూసుకోవాలని, ఆహారనియాలు తప్పనిసరిగాపాటిస్తూ, శరీరానికి తగిన వ్యాయామం ఇస్తే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
హార్ట్ అటాక్ వయస్సుతో సంబంధముందా?
ప్రస్తుత జీవనశైలి కారణంగా ఇప్పుడు 30ల వయస్సులోనే చాలా మందికి హార్ట్ అటాక్ వస్తోంది. పాతకాలంలో ఇది పెద్దల వ్యాధిగా ఉండేది కానీ ఇప్పుడిది యువతలోనూ పెరుగుతోంది.
హార్ట్ అటాక్‌ను నివారించడానికి మార్గాలు?
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి,ప్రతిరోజూ వ్యాయామం,పొగత్రాగడం మానేయాలి,ఒత్తిడిని నియంత్రించాలి,రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి,కొలెస్ట్రాల్, బిపి, షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంచాలి.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Srinivas Goud: ఆగస్టు 7న గోవాలో జాతీయ ఒబిసి మహాసభ