కర్ణాటక, మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది (Krishna River) లో భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయాని (Srisailam Reservoir) కి భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,27,392 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా నమోదైంది.

53,764 క్యూసెక్కుల నీరు
రెండు స్పిల్ వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు (Pothireddypadu) హెడ్ రెగ్యులేటరీ నుంచి 20వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.
శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882.40 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది.
శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం ఎందుకు పెరిగింది?
కృష్ణా నదికి ఎగువన ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాలు పడటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఈ కారణంగా వరద ప్రవాహం పెరిగింది.
వరద వల్ల ఎలాంటి ప్రాంతాలకు ప్రభావం పడే అవకాశముంది?
శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం జిల్లాల నదీతీర ప్రాంతాలకు వరద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Read hindi news: hindi.vaartha.com
Read also: CM Chandrababu Naidu Singapore Visit: ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ