మాంచెస్టర్ టెస్టు (Manchester Test) రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత శతకం నమోదు చేశాడు. ఈ సెంచరీతో ఒకే టెస్టు సిరీస్లో అత్యధిక శతకాలు చేసిన కెప్టెన్గా అరుదైన ఘనత సాధించాడు.గిల్ ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు శతకాలు సాధించాడు. దీంతో సునీల్ గవాస్కర్, డాన్ బ్రాడ్మన్ల రికార్డులను సమం చేశాడు. ఈ ఇద్దరూ ఒక్కో సిరీస్లో నాలుగు శతకాలు సాధించారు.ఈ సిరీస్లో గిల్ ఇప్పటికే 700 పరుగులు పూర్తి చేశాడు. ఒకే టెస్టు సిరీస్లో 700 పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్ రెండుసార్లు, యశస్వి జైస్వాల్ ఒక్కసారి ఈ ఘనత సాధించారు.

ఇంగ్లాండ్ గడ్డపై కొత్త రికార్డు
ఇంగ్లాండ్లో జరిగిన సిరీస్లో 700 పరుగులకుపైగా చేసిన ఏకైక ఆసియా బ్యాట్స్మన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో అతనికి ఇది తొమ్మిదో శతకం.టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 101 ఓవర్లలో 4 వికెట్లకు 269 పరుగులు చేసింది. గిల్ 103 పరుగులతో మెరిశాడు. కేఎల్ రాహుల్ 90 పరుగుల వద్ద అవుటయ్యాడు.
క్రీజులో జడేజా, సుందర్
ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా 27, వాషింగ్టన్ సుందర్ 36 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది.ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఆధిక్యానికి భారత్ ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ఇవాళ ఐదో రోజు ఆట జరుగుతుండగా మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Read Also : Sunil Gavaskar: టీమిండియా ఓటమికి కారణం గౌతమ్ గంభీరే