నల్గొండ బస్‌స్టాండు (Nalgonda Bus Stand) లో మానవత్వాన్ని కలిచివేసే ఘోర ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం ఓ తల్లి కన్నబిడ్డను దిక్కులేని అనాధగా వదిలేసి వెళ్లిపోయింది. ఈ దృశ్యం స్థానికంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందిని, ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.వివరాల్లోకి వెళితే, నల్గొండ బస్‌స్టాండ్‌లో ఓ చిన్నారి (దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వయసు) ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు. ఎవ్వరివాడు? ఎవరు వదిలారు? అని అక్కడి సిబ్బంది, ప్రయాణికులు గమనించారు. ఆ చిన్నారి ఏడుపుతో, తల్లి కోసం చుట్టూ తిరుగుతున్న తీరు అందరి గుండెల్ని కలిచివేసింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది (RTC staff) పోలీసులకు సమాచారం అందించారు.
అసలు విషయం
పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే బస్‌స్టాండ్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్లి బస్‌స్టాండ్‌లో వదిలి వెళ్తున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఆ ఆధారంతో ఆమెను గుర్తించారు. ఆమె భర్తకు సమాచారమిచ్చి బిడ్డను అతనికి అప్పగించారు. విచారణలో అసలు విషయం బయటపడింది.ఆ తల్లి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ వ్యక్తి తనతో కలిసి రావాలని ఒత్తిడి చేయడంతో – తల్లి తన చిన్నారిని ఆటంకంగా భావించి, బస్టాండ్‌లో వదిలేసి అతనితో వెళ్లిపోయింది. మానవ సంబంధాలను మరిచి, తల్లితనాన్ని పక్కనపెట్టి – ఇలా చెయ్యడం పోలీసులకు కూడా షాకింగ్ కలిగించింది.
నల్గొండ ఎందుకు ప్రసిద్ధి చెందింది?
నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ జిల్లా. ఇది తన సమృద్ధి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మరియు సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది.
నల్గొండ ఒక నగరమా లేక జిల్లానా?
నల్గొండ ఒకే సమయంలో నగరంగా కూడా, జిల్లాగా కూడా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana Rains : హైదరాబాద్ వాసులకు వర్షాల నుంచి రిలీఫ్