తెలంగాణ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. గతంలో టీపీసీసీ చీఫ్ (TPCC Chief) గా ఉన్న సమయంలో నమోదైన రెండు కేసులపై ఈరోజు విచారణ జరిగింది. కోర్టు ముందు విచారణ జరిగిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి హాజరయ్యారు.ఈ కేసులు 2021లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో నమోదయ్యాయి. అప్పట్లో ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ర్యాలీలకు సంబంధించి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటిలో ట్రాఫిక్ కు ఆటంకం కలిగించడము, పబ్లిక్ ఆర్డర్ భంగం, అనుమతి లేకుండా బహిరంగ సభలు నిర్వహించడంపై నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు ఉన్నాయి.

న్యాయవాదులు
నాంపల్లి కోర్టు ముందు ఈ రెండు కేసులపై వాదనలు వినిపించాయి. ప్రభుత్వ వాదనలతో పాటు, రేవంత్ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, కోర్టు కేసును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణలో మరిన్ని ఆధారాలు సమర్పించే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్హత ఏమిటి?
తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు ఒస్మానియా యూనివర్సిటీకి చెందిన ఆంధ్ర విద్యాలయ కాలేజీ (Andhra Vidyalaya College, Hyderabad) నుండి బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) పట్టా పొందారు.
రేవంత్ రెడ్డి జన్మతేది, జన్మస్థలం ఏమిటి?
అయన 1969 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొండ రెడ్డి పల్లి గ్రామంలో జన్మించారు (ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణలో).
Read hindi news: hindi.vaartha.com
Read also: Bandi Sanjay: రేపు సిట్ విచారణకు హాజరు కాలేను : బండి సంజయ్