ఆసియా కప్ Asia Cup 2025 తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై 28న ముగియనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈసారి ఆతిథ్య వేదిక కానుంది.దుబాయ్, అబుదాబి నగరాలు ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తాయి. భారత్ ఆతిథ్య హక్కులు పొందినప్పటికీ, బీసీసీఐ (BCCI) తటస్థ వేదికగా యూఏఈని ఎంచుకుంది.మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో తలపడతాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ జట్లు పాల్గొంటాయి.

టీ20 ఫార్మాట్‌లో టోర్నీ
ఈసారి ఆసియా కప్ పూర్తిగా టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఐసీసీ ఈవెంట్స్‌కు ముందు ఇది జట్లకు ముఖ్యమైన సన్నాహక వేదికగా ఉంటుంది.చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం ఉంది. అలా జరిగితే లీగ్ దశలో ఒకసారి, సూపర్-4 రౌండ్‌లో మరోసారి తలపడతాయి.
ఫైనల్లో పోటీ అవకాశమూ
ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే, ఆసియా కప్‌లో మరోసారి ఆసక్తికర పోటీ చూడొచ్చు. అభిమానులు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.యూఏఈలో నిర్వహణ కారణంగా భారత్, పాకిస్థాన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా. టోర్నీ సమీపిస్తున్న కొద్దీ ఉత్సాహం మరింత పెరుగుతోంది.
Read Also : Ben Stokes : తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 669 ఆలౌట్