బీహార్(Bihar) రాష్ట్రంలోని జర్నలిస్టులకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitesh Kumar) వరాలజల్లును కురిపించారు. ‘బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం’ కింద అర్హులైన జర్నలిస్టులకు ప్రతినెలా అందించే పెన్షన్ మొత్తాన్ని ఆరువేల నుంచి 15వేలకు పెంచారు.

మరణించిన జర్నలస్టులకు వర్తిస్తుంది
ఆ ఈ పెన్షన్ కేవలం జర్నలిస్టులకే కాకుండా మరణించిన జర్నలిస్టులపై ఆధారపడిన జీవితభాగస్వాములకు కూడా వర్తిస్తుంది. వారికి ఇచ్చే జీవిత కాల పెన్షన్ రూ 3,000 నుంచి రూ 10,000కు పెంచింది. ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రియే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి నిజమైన వార్తలను అందించడంలో, ప్రజల వాణిని ప్రభుత్వానికి వినిపించడంలో జర్నలిస్టులు కీలకమైన నాలుగవ స్తంభంగా
నిలుస్తున్నారని ప్రశంసించారు .
పెన్షన్ చరిత్ర ఏమిటి?
19వ శతాబ్దం చివరిలో ఆధునిక రకాల పెన్షన్ వ్యవస్థలు మొదట ప్రవేశపెట్టబడ్డాయి. ఉద్యోగుల కోసం సార్వత్రిక పెన్షన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం జర్మనీ.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పెన్షన్ వ్యవస్థ ఏది?
జర్మనీ 1889లో వృద్ధాప్య సామాజిక బీమా పథకాన్ని స్వీకరించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అవతరించింది, దీనిని జర్మనీ ఛాన్సలర్ ఒట్టో వాన్ బిస్మార్క్ రూపొందించారు. ఈ ఆలోచనను బిస్మార్క్ ఆదేశం మేరకు 1881లో జర్మనీ చక్రవర్తి విలియం ది ఫస్ట్ జర్మన్ పార్లమెంట్‌కు రాసిన ఒక కొత్త లేఖలో ముందుకు తెచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Sridhar Babu: ఇ-గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా సహకారం తీసుకుంటాం :మంత్రి శ్రీధర్ బాబు