ఆధునిక సమాజంలో వైవాహిక బంధాలు: సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు
ఆధునిక సమాజంలో భార్యభర్తల సంబంధాలు అగమ్యగోచరంగా మారాయి. ‘ఏడు జన్మల బంధం’ అని పవిత్రంగా భావించే వివాహ బంధం కొద్ది నెలలు, కొన్ని సందర్భాల్లో కొద్ది రోజుల్లోనే తెగిపోతోంది. చిన్న చిన్న మనస్పర్థలకు కూడా విడాకులకు దారి తీసి, భరణం కోసం కోర్టు మెట్లు ఎక్కడం సాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత భరణం కోరే ఉద్యోగినులకు, ముఖ్యంగా ఆర్థికంగా స్వతంత్రంగా జీవించే సామర్థ్యం ఉన్న మహిళలకు ఈ తీర్పు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.

18 నెలల వివాహానికి రూ.12 కోట్ల భరణం: సుప్రీంకోర్టు విస్మయం
ఒక హై-ప్రొఫైల్ భరణం కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కేంద్ర బిందువుగా నిలిచాయి. ఎంబీఏ చదివి, ఐటీ ఉద్యోగిని అయిన ఒక మహిళ, తన 18 నెలల వివాహ బంధం తెగిపోయిన తర్వాత తన భర్త నుంచి భారీ మొత్తంలో భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ముంబైలో ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్, రూ.12 కోట్లు భరణం, ఒక విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారును ఆమె కోరడం న్యాయమూర్తులనే ఆశ్చర్యపరిచింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, న్యాయమూర్తులు జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది.
“మీరు ఎందుకు పని చేయకూడదు?” – సీజేఐ సూటి ప్రశ్న
విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి ఆ మహిళ విద్యార్హతలు, వృత్తి అనుభవాన్ని ప్రస్తావిస్తూ సూటిగా ప్రశ్నించారు. “మీరు ఐటీ రంగంలో ఉన్నారు. ఎంబీఏ చేశారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో మీకు డిమాండ్ ఉంటుంది.. మీరు ఎందుకు పని చేయకూడదు?” అని ప్రశ్నిస్తూ, కేవలం 18 నెలల బంధానికి ఇంత భరణం కోరడం న్యాయసమ్మతమా అని ప్రశ్నించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో ఆశించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. తన భర్త ధనవంతుడని, మానసిక ఆరోగ్య సమస్యల (స్కిజోఫ్రెనియా వంటివి) ఆధారంగా వివాహ రద్దు కోసం దరఖాస్తు చేశారని మహిళ సమాధానం ఇచ్చింది.
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు: ఆత్మగౌరవంతో జీవించండి
చివరికి, కోర్టు రెండు ఆప్షన్లను ఇచ్చింది: ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేని అపార్ట్‌మెంట్‌ను భరణంగా తీసుకోవడం లేదా రూ.4 కోట్లు ఒకేసారి పరిష్కారంగా తీసుకోవడం. “మీరు చదువుకున్నవారు. మీకు మీరు సంపాదించుకోండి. దయచేసి దీనితో (లభించిన ఆస్తి/డబ్బుతో) గౌరవంగా జీవించండి. ఎవరిపైనా ఆధారపడకండి” అని సీజేఐ గవాయి (CJI Gawai) ఆమెకు స్పష్టంగా చెప్పారు. తనపై అభియోగాలు మోపారని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని (FIR registered), అందువల్ల ఉద్యోగం రాదని మహిళ వాపోగా, దానికి సీజేఐ సమాధానం ఇస్తూ, ఆ ఎఫ్‌ఐఆర్‌ను కూడా రద్దు చేస్తామని, కానీ ఆమె జీవితాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. ఈ కేసు విచారణ చాలా ఆసక్తికరంగా సాగింది. పిటిషనర్ అయిన మహిళ డిమాండ్లను విని అవాక్కయిన చీఫ్ జస్టిస్, చివరికి ఆమె కోరికలకు కళ్ళెం వేస్తూ, భర్త ఇచ్చే భరణంతోపాటు తన పోషణకు తాను కూడా పని చేయాలని ఆ మహిళను ఆదేశించారు. ఈ తీర్పు ఆధునిక సమాజంలో విడాకుల తర్వాత భరణంపై ఒక నూతన దృక్పథాన్ని నెలకొల్పింది.
సుప్రీంకోర్టు అంటే ఏమిటి?
భారత రాజ్యాంగం ప్రకారం భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయవ్యవస్థ . రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం “భారత సుప్రీంకోర్టు ఉండాలి” అని పేర్కొంది. రాజ్యాంగం అమల్లోకి రావడంతో 1950 జనవరి 26న సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది.
సుప్రీంకోర్టు మూడు రకాలు?
సుప్రీంకోర్టుకు అసలు, అప్పీలేట్ మరియు సలహా అధికార పరిధి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Karnataka Bhavan: సిద్ధరామయ్య, శివకుమార్ ఓఎస్డీల గొడవ