हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Governor Jishnu Deva Varma: నర్సులే సమాజానికి ప్రాణదాతలు– గవర్నర్ జిష్ణుదేవవర్మ

Anusha
Governor Jishnu Deva Varma: నర్సులే సమాజానికి ప్రాణదాతలు– గవర్నర్ జిష్ణుదేవవర్మ

ఘనంగా 4వ బ్యాచ్ బిఎస్సీ నర్సింగ్ విద్యార్థుల స్నాతకోత్సవ సభ

హైదరాబాద్ (శేరిలింగంపల్లి) : నర్సింగ్ వృత్తి కీలకమైనదని, నర్సులే సమాజానికి ప్రాణ ప్రధాతలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళా దక్షత సమితి విద్యాసంస్థలు, బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రుల 4వ బ్యాచ్ స్నాతకోత్సవ కార్యక్రమం చందానగర్ గంగారంలోని మహిళ దక్షతసమితి ప్రాంగంణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) మాట్లాడుతూ. నర్సులు సమాజానికి అదృశ్యశక్తులన్నారు. నర్సులు కేవలం డిగ్రీలు తీసుకోవడమే కాకుండా సరికొత్త బాధ్యతలు, హమీలు, మానవజాతికి సేవ చేయలన్న లక్ష్యాన్ని స్వీకరించారని గుర్తుచేసుకోవాల న్నారు. డాక్టర్ సరోజ్ బజాజ్ లాంటి నాయకత్వపు మార్గనిర్దేకత్వంలో విద్యార్థులు నూతన ప్రపంచంలోనికి ఎంతో ఉత్సాహాంతో డిగ్రీ సాధించారని, సాధికారతతో కూడిన మహిళలుగా సమాజానికి చికిత్స చేయటానికి బయట అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షించారు.

మహామ్మారుల సమయంలో

రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారిణి అభిలాష బిస్త్ మాట్లాడుతూ.. నర్సింగ్ అనేది కేవలం ఒక ఉద్యోగం కాదని, అదొక దైవకార్యం లాంటిదన్నారు. వృత్తిపరమైన జీవితాల్లోనికి పవిత్రభావనతో అడుగుపెట్టాలన్నారు. వసుద స్నాతకోత్సవ సభకు హజరైన గవర్నర్ జిష్ణుదేవవర్మ ఫార్మా కెమ్ లిమిటెడ్ సీఎండీ మంతెన వెంకట రామరాజు మాట్లాడుతూ వైద్యవ్యవస్థకు ఎంతగానో అవసరమైన నర్సింగ్ వృత్తి కీలకమైన దన్నారు. తపాడియా డయాగ్నస్టిక్స్ ఎండి డాక్టర్ మహేశ్ తపాడియా మాట్లాడుతూ.. కోవిడ్ (Covid) వంటి మహామ్మారుల సమయంలో కూడా ఎంతో ధైర్యంగా సేవలందించిన మహిళా దక్షత సమితికి తమ వంతు సహకారం అందిస్తామని, ఉచితంగా నర్సింగ్ విద్యార్థులందరికి తలసీమియా పరీక్షలు చేయిస్తామన్నారు.మహిళా దక్షత సమితి అధ్యక్షురాలు డాక్టర్ సరోజ్ బజాజ్ మాట్లాడుతూ 1991లో స్థాపించిన తమ సంస్థలో ఇప్పటి వరకు 10వేల మందికి పైగా యువతులు నిరుపేదలుగా తమ వద్దకు వచ్చినవారేనని, వారికి వైద్యం, ఆర్థిక టెక్నాలజీ రంగాల్లో శిక్షణనిచ్చి జీవితంలో స్థిరపడే విధంగా తమవంతు సహకారం అందిస్తున్నామన్నారు.

Governor Jishnu Deva Varma: నర్సులే సమాజానికి ప్రాణదాతలు-- గవర్నర్ జిష్ణుదేవవర్మ
Governor Jishnu Deva Varma: నర్సులే సమాజానికి ప్రాణదాతలు– గవర్నర్ జిష్ణుదేవవర్మ

గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన

విద్యార్థుల అవసరాలకు, ఆడిటోరియం నిర్మాణానికి దాదాపు 1.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాలికల హస్టల్, ఆడిటోరి యంలకు తమ దాతృత్వం చాటుకుంటున్న దాతలు సజ్జన్ కుమార్ గోయెంకా, అరుణా మాలిని, నిర్మలా గోయెంకా, దివంగత రాంగోపాల్ గోయెంకాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళ దక్షత సమితి సంస్థల ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ (Nursing graduate) పూర్తిచేసిన 50 మంది విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టాలను అందించారు.ఈ కార్యక్రమానికి వెయ్యిమందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, అతిధులు హాజర య్యారు. ఈ కార్యక్రమంలో ఎండిఎస్ ప్రధాన కార్యదర్శి జి. లక్ష్మీ, విమలా భద్రుకా, మున్నా జెగెతియ, శారధా గుప్త, జయా బహితి, షీలా సొంతా లియా, అనిత్ అగర్వాల్, లక్ష్మీకుమార, రాజశ్రీజైన్, జ్ఞానపతి పరాష్, డాక్టర్ ఆకాశ్ అగ ర్వాల్, లలిత కుమార్ అగర్వాల్, శ్యాంసుందర్ ముందాడ, శకుంతల తదితరులు పాల్గొన్నారు.

జిష్ణు దేవ్ వర్మ ఎవరు?

జిష్ణు దేవ్ వర్మ (జననం: ఆగస్టు 15, 1957) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి గవర్నరుగా (3వ గవర్నర్‌గా) 31 జూలై 2024 నుండి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

జిష్ణు దేవ్ వర్మ ఎప్పుడు తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు?

జిష్ణు దేవ్ వర్మ 2024 జూలై 31వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Accident: ఘోరరోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870