ఇంతలో కనిపించి, అంతలో మాయమైపోయే ఆవిరివంటి మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో ఆశలు, ఆశయాలతో ఉన్నత చదువు చదివి, గొప్పదాన్ని కావాలనే ఆ యువతి కలలు కన్నీరే అయ్యాయి. కోటి ఆశలు ఎండమావిగానే మిగిలిపోయాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ (Shadnagar) పట్టణ చైరస్తాలో శనివారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. తన కూతురు మైత్రిని శంషాబాద్ వద్దమాన్ కాలేజీకి పంపించేందుకు బస్టాండ్కు వస్తుండగా ట్యాంకర్ వీరి బైక్తో ఢీకొట్టింది (tanker collided with their bike). దీంతో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రీ, కూతుళ్లపై టైర్లు వెళ్లడం వల్ల వారిద్దరూ మరణించారు. ఆ కుటుంబంలో తీవ్రవిషాదం చోటు చేసుకుంది. టైర్లకింద ఇరుక్కున్న మైత్రి తనను రక్షించమంటూ వేడుకోవడం కంటతడి పెట్టించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: TGCSB: టిజిసిఎస్బి ఆధ్వర్యంలో సైబర్ వారియర్లు, అధికారులకు ప్రత్యేక శిక్షణ