హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసు నుంచి ముగ్గురు నిందితులు బెయిల్‌పై బయటపడ్డారు. మల్కాజ్‌గిరి కోర్టు వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అనుకూలంగా పరిశీలించి, ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే HCA ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావును మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించాలన్న CID పిటిషన్‌ను మాత్రం కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో జగన్మోహన్‌రావు, సునీల్‌ల పిటిషన్లపై సోమవారం వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.
ఇకపోతే, ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చిన అక్రమాల కంటే భిన్నంగా HCAలో మరో పెద్ద స్కామ్ బయటపడింది. తాజా సమాచార ప్రకారం, HCA అధిపతులు సమ్మర్ క్యాంపుల పేరుతో సుమారు రూ.4 కోట్ల వరకు అక్రమంగా వడ్డించారని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపుల్లో ఒక్కో క్యాంప్‌లో 100 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చామన్న తప్పుడు లెక్కలు చూపించారని సీఐడీ గుర్తించింది. మొత్తంగా 2,500 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చినట్లు చూపించి నిధులు దారి మళ్లించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో HCAలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు జస్టిస్ నవీన్‌రావును ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆయన ఆధ్వర్యంలో సంస్థ ఆర్థిక వ్యవహారాలను, క్రికెట్ అభివృద్ధికి జరిగిన ఖర్చులను సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ కేసు HCA పరిపాలనలో ఉన్న లోపాలను, రాజకీయ హస్తక్షేపాలను మరోసారి బయటపెడుతూ రాష్ట్ర క్రికెట్ పరిపాలన విధానాలపై ప్రశ్నలు రేపుతోంది.
Read Also : Devaraj : హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ అరెస్టు