భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ (England batter) జో రూట్ (Joe Root) అద్భుతం చేశాడు. తన ఆటతో పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో జో రూట్ రెండో స్థానానికి ఎదిగాడు. సచిన్ టెండుల్కర్ 15,291 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 200 మ్యాచ్‌ల్లో 51 శతకాలతో ఈ రికార్డు సృష్టించాడు.ఇప్పటి వరకు 168 మ్యాచ్‌ల్లో 41 శతకాలతో 13,378 పరుగులతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు జో రూట్ 13,379 పరుగులతో ఆయనను వెనక్కి నెట్టాడు.

ఇతర దిగ్గజాలను వెనక్కి నెట్టిన రూట్
జాక్వెస్ కలీస్ 13,289 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ 13,288 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రూట్ రెండో స్థానానికి చేరుకోవడం ఇంగ్లండ్ అభిమానులను ఉత్సాహపరిచింది.ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో 1,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు జో రూట్ అయ్యాడు. ఈ ఘనత కూడా ఆయన పేరుతో చేరింది.
కెప్టెన్సీలోనూ రూట్ రికార్డులు
జో రూట్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌కు అత్యధిక మ్యాచ్‌లలో (64) కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే 27 విజయాలు సాధించిన అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ కూడా రూట్‌నే.నాలుగో వికెట్‌కు 454 పరుగుల భారీ భాగస్వామ్యం కూడా రూట్ పేరుతో ఉంది. లార్డ్స్ మైదానంలో అత్యధిక పరుగులు (2,166), అత్యధిక సెంచరీలు (8) సాధించిన ఆటగాడు కూడా ఆయనే.అలాగే టెస్ట్ క్రికెట్‌లో 211 క్యాచ్‌లతో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు అనే రికార్డు కూడా జో రూట్ ఖాతాలోనే ఉంది.
Read Also : Devaraj : హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ అరెస్టు