టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కి టీం సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలవడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తీసుకున్న ఓ కీలక నిర్ణయం వివాదాస్పదమైంది. మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతిని అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కాకుండా అరంగేట్రం చేస్తున్న యువ పేసర్ అన్షుల్ కంబోజ్‌కు అప్పగించడం వల్ల భారత్ మొదటి నుంచే ఒత్తిడికి లోనైంది.అన్షుల్ కంబోజ్ తన తొలి ఓవర్‌లోనే కంట్రోల్ కోల్పోయి మూడు బౌండరీలు ఇస్తే, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) దాన్ని పాజిటివ్‌గా మలుచుకొని దూకుడుగా ఆడాడు. ఇది బెన్‌కు ఆత్మవిశ్వాసం ఇచ్చింది, తద్వారా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బలమైన ఆధిపత్యాన్ని సాధించింది. దీంతో గిల్‌పై విమర్శల వర్షం కురిసింది. అనుభవం లేని బౌలర్‌కు కొత్త బంతి ఇచ్చి టీమ్‌పై ఒత్తిడి తెచ్చాడని పలువురు మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు గిల్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
మరోవైపు
కానీ, భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మాత్రం శుభ్‌మన్ నిర్ణయానికి పూర్తిగా మద్దతు తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విషయంపై మాట్లాడిన అశ్విన్, “గిల్ ఎందుకు అలా చేశాడో నేను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాను.అన్షుల్‌కు మంచి మణికట్టు పొజిషన్ ఉంది. అతను బంతిని ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ రెండూ చేయగలడు. అతనిలో ఉన్న టాలెంట్‌ను గిల్ గుర్తించి కొత్త బంతి ఇచ్చాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పాత బంతితో కూడా బెస్ట్ డెలివరీలు ఇవ్వగలడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గిల్ తను తలచిన నిర్ణయం తీసుకున్నాడు” అని వ్యాఖ్యానించాడు.మరోవైపు సిరాజ్, పాత బంతితో కూడా రాణించగలడు. దాంతోనే అన్షుల్‌కు గిల్ కొత్త బంతి అందించాడు.అరంగేట్ర మ్యాచ్‌లోనే జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి బాజ్ బాల్‌కు వ్యతిరేకంగా అన్షుల్ కంబోజ్ మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఆశించడమే అత్యాశ. అతని మొదటి స్పెల్ నిరాశపర్చింది. కానీ తర్వాత అతను అద్భుతంగా పుంజుకున్నాడు. రేపు(మూడో రోజు ఆట) పరిస్థితులు అనుకూలిస్తే అతను మరిన్ని వికెట్లు తీసినా నేను ఆశ్చర్యపోను’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

బౌలర్లలో
ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 46 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(100 బంతుల్లో 13 ఫోర్లతో 94), జాక్ క్రాలీ (113 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 84) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. క్రీజులో ఓలిపోప్(16 బ్యాటింగ్)తో పాటు జోరూట్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ అన్షూల్ కంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసారు.అంతకుముందు 264/4 ఓవర్‌నైట్ స్కోర్ (Overnight score) తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు. ఇంగ్లండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.
శుభ్‌మన్ గిల్ పంజాబీనా?
అవును, శుభ్‌మన్ గిల్ ఒక పంజాబీ. ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లాలోని చక్ జైమల్ సింగ్ వాలా అనే గ్రామంలో పుట్టాడు.
శుభ్‌మన్ గిల్ ఏ భాష మాట్లాడతాడు?
శుభ్‌మన్ గిల్ పంజాబీ భాష మాట్లాడతాడు. ఆయన పంజాబీ కుటుంబానికి చెందినవాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Yash Dayal: RCB పేసర్ యశ్ దయాల్‌పై మరో కేసు నమోదు.. పూర్తివివరాలు ఇవే