ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy) కి మరోసారి నిరాశ
మిగిలింది. ఈ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను 29కి కోర్టు
వాయిదా వేసింది. దీంతో మిథున్రెడ్డి మరో నాలుగు రోజులు జైల్లోనే ఉండే పరిస్థితి
ఎదురైంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి (Avinash Reddy) పాత్రపై ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశాలను ఇచ్చింది.

రివ్వూ పిటిషన్ వేసిన రాహుల్
మిథున్రెడ్డికి సహాయకుడిని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన
ఆదేశాలపై రాజమండ్రి జైలు (Rajahmundry Jail) సూపరింటెండెంట్ రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.జైలులో ఖైదీలకు సహాయకుల్ని ఏర్పాటు చేసే నిబంధనలు లేవని, కోర్టు ఆదేశాల్లో ఉన్నమార్గదర్శకాలను పునఃపరిశీలించాలని ఆయన కోరారు. ఈనెల 29న జరిగే విచారణ
తర్వాత మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది స్పష్టత
వచ్చే అవకాశముంది.
మిధున్ రెడ్డి పార్లమెంట్‌లో ఏ పదవులు చేపట్టారు?
మిధున్ రెడ్డి పార్లమెంట్‌లో పలు కమిటీలకు సభ్యుడిగా వ్యవహరించారు. అలాగే, 2019లో పార్లమెంట్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ (Chief Whip) గా కూడా నియమితులయ్యారు.
మిధున్ రెడ్డి ఏ నియోజకవర్గం నుండి గెలిచారు?
ఆయన రాజంపేట లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు.
Read Hindi News: hindi.vaartha.com
Read Also: AP : ఆంధ్రప్రదేశ్ జనాభా పెంపు పాలసీ: తల్లులకు కొత్త ప్రయోజనాలు