ఖమ్మంజిల్లా చింతకాని మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోడౌన్ (PACS Godown) ఎదుట యూరియా (Urea) కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. నిలబడే ఓపిక లేక క్యూలైన్లో చెప్పులు పెట్టి మరీ పడిగాపులు కాస్తున్న రైతుల వ్యతలను పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో రైతుల పరిస్థితి ఇలా ఉంటే, మరి రాష్ట్రంలో ఎంత అధ్వాన్నంగా ఉందో అని రైతులు విమర్శిస్తున్నారు. వర్షాకాలం వచ్చి, విస్తారంగా వర్షాలు కురుస్తున్నా ఇప్పటివరకు రైతులకు యూరియా అందడం లేదు. వేకువజామున నుంచే యూరియా కోసం గోడౌన్ల ఎదుట చెప్పులను క్యూలైనులో పెట్టి ఎదురుచూస్తున్నారు.

ఇదంతా అబద్దం: రేవంత్రెడ్డి
యూరియా (Urea) కోసం రైతులు లైన్లో నిలబడ్డట్టు (Farmers standing in line), చెప్పులను లైన్లో పెట్టినట్లు, యూరియా ఎరువులు తమకు దొరడం లేదని సోషల్ మీడియాలో ఆర్టిఫిషయల్ షార్టేజ్ క్రియేట్ చేసి, చూపిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇవన్నీ అసత్యాలని, వీటిని నమ్మవద్దని తెలిపారు. మేం రైతుపక్షంగా పాలించేవారమని, రైతుల అవసరాలను
ఎప్పటికప్పుడు తీరుస్తున్నట్లు రేవంత్రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: TG Cabinet: వాయిదాపడ్డ తెలంగాణ క్యాబినెట్ సమావేశం