విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమా న్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సిఎం.. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళుతున్నారు. బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు.

పారిశ్రామిక ప్రోత్సాహంతో ఎపికి పెట్టుబడుల వేట
Chandrababu Naidu: ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను (Business policies) వివరించి పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కి.మీ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామిక వేత్తలను (Industrialists) పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఎపిలో పెట్టబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు.
చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్ యజమాని ఎవరు?
హెరిటేజ్ ఫుడ్స్‌ను 1992లో నారా చంద్రబాబు నాయుడు స్థాపించారు, మొదట్లో ఇది ఒక పాడి పరిశ్రమగా ఉండేది. కాలక్రమేణా, కంపెనీ పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు రిటైలింగ్‌లోకి విస్తరించి, భారతదేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారులలో ఒకటిగా మారింది. హెరిటేజ్ ఫుడ్స్ సాంకేతికత మరియు పంపిణీలో వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా అభివృద్ధి చెందింది.
చంద్రబాబు నాయుడు కంపెనీ ఏది?
హెరిటేజ్ గ్రూప్‌ను 1992లో తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్థాపించారు, దాని ప్రధాన కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (HFL) కింద డెయిరీ, రిటైల్ మరియు వ్యవసాయం అనే మూడు వ్యాపార విభాగాలు, ఒక మౌలిక సదుపాయాల అనుబంధ సంస్థ – హెరిటేజ్ ఇన్ఫ్రా డెవలపర్స్.. ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Chandrababu : ఎల్లుండి సింగపూర్ కు సీఎం చంద్రబాబు