విమాన ప్రయాణాలు చేయాలంటే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. తరచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. అహ్మదాబాద్ విమాన ప్రమాద విషాదం మరువకముందే మరో విమానం అదృశ్యమైపోయింది (plane disappeared). దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చైనా సరిహద్దులో రష్యా (Russia) దేశానికి చెందిన ఓ విమానం కనిపించకుండా పోయింది. విమానంలో 50 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. చైనాకు సమీపంలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండాకు వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుతుందనగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో విమానానికి సంబంధాలు తెగిపోయి అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు .
Read hindi news: hindi.vaartha.com