हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

kanda bachali kura recipe:కంద-బచ్చలి కూర

Hema
kanda bachali kura recipe:కంద-బచ్చలి కూర
kanda bachali kura recipe-కావలసిన పదార్థాలు

కందముక్కలు – పెద్ద కప్పు
బచ్చలికూర తరుగు – పెద్ద కప్పు
నూనె – పావు కప్పు
ఎండుమిరపకాయలు – ఐదు
సెనగపప్పు – టేబుల్ స్పూను
మినప్పప్పు – టేబుల్ స్పూను
జీలకర్ర – ఒక చెంచా
ఆవాలు – రెండు చెంచాలు
పచ్చిమిరపకాయలు – రెండు
కరివేపాకు – రెండు రెబ్బలు
ఉప్పు – తగినంత
పసుపు – కొద్దిగా
ఇంగువ – కొద్దిగా
చింతపండు రసం – రెండు స్పూన్లు

kanda bachali kura recipe

తయారు చేసే విధానం
ముందుగా కంద ముక్కలను కుక్కర్లో వేసి సరిపడినన్ని నీళ్లు (water) పోసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి రెడీగా పెట్టుకోవాలి. ఒక స్పూను ఆవాలు, రెండు ఎండుమిరపకాయలు కలిపి పొడి చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో నూనె(oil) వేసి మిగిలిన ఎండు మిరపకాయలు, సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మిగిలిన ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, పసుపు వేయాలి.

kanda bachali kura recipe

ఒక నిమిషం తరువాత బచ్చలికూర తరుగు వేసి కాసేపు ఉడికిన తరువాత ఉడికించిన కంద ముక్కలు, తగినంత ఉప్పు, చింతపండు రసం వేసి కలపాలి. కూర ముద్దలా దగ్గరికి అవుతున్నప్పుడు స్టవ్‌ను ఆఫ్ చేసి తయారు చేసి పెట్టుకున్న ఆవపొడి వేసి మరొక్కసారి కలిపితే రుచికరమైన కంద-బచ్చలి కూర సిద్ధం.

Read also: hindi.vaartha.com

Read also: Raw banana fry recipe: అరటికాయ పొడికూర

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870