Raw banana fry recipe-కావలసిన పదార్థాలు:
- అరటికాయలు – 2
- నిమ్మరసం – 1 స్పూను
- కొత్తిమీర తరుగు – 1 టేబుల్ స్పూను
- ఉప్పు – తగినంత
- ధనియాలు – 2 స్పూన్లు
- ఆవాలు – 1 స్పూను
- జీలకర్ర – అర స్పూను
- మెంతులు – కొద్దిగా
- ఎండు మిరపకాయలు – 4
- వేయించిన సోంపు పొడి – కొద్దిగా

తయారు చేసే విధానం
స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు, అర చెంచా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, సోంపు వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకోవాలి. అరటికాయలను(banana) చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా పసుపు నీళ్లల్లో అయిదు నిమిషాలు ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె (oil) వేసి మిగిలిన ఆవాలు, కరివేపాకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడాక అరటికాయ ముక్కలు, తగినంత ఉప్పు, సిద్ధంగా పెట్టుకున్న పొడి వేసి బాగా వేయించాలి. కూర దింపే ముందు కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

Read also: hindi.vaartha.com
Read also: Poppadikaya Vantalu: పొప్పడికాయ కూర