బెట్టింగ్ యాప్స్ కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు సినీప్రముఖులు, సెలబ్రిటీ (Celebrity) ల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తున్నది. ఇందులో భాగంగా ముందుగాఈడీ ఆగస్టు 6వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆగస్టు11న విచారణకు రావాలని మరోకసారి నోటీసులను జారీ చేసింది. విజయ్ దేవరకొండతో పాటు రానాదగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మిలకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రకాష్ రాజకు జులై 30న,విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఆగస్టు 6న, మంచులక్ష్మిని ఆగస్టు 13న హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

జీవితాలను పాడుచేస్తున్న ఇలాంటి యాప్స్ లకు దూరంగా ఉండాలి..
బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ యాప్మాయలో చిక్కుకుని,
అప్పుల పాలైనవారెందరో ఉన్నారు. గుర్తింపులేని యాప్స్ తో యువత తమ అందమైన జీవితాన్ని నాశనంచేసుకుంటున్నారు. ఈ యాప్స్ కు సినీప్రముఖులు (Movie celebrities) ప్రచారం చేశారు. అనుమతి లేని యాప్స్ పై ప్రచారంచేసి, ఆర్థిక లాభాలను పొందినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. దీనిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినవిషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ పూర్తి పేరు ఏమిటి?
విజయ్ దేవరకొండ పూర్తి పేరు విజయ్ సాయిదేవరకొండ.
విజయ్ దేవరకొండ తొలి సినిమా ఏది?
ఆయన 2011లో విడుదలైన నువ్విలా అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. కానీ ఆయనకు నిజమైన గుర్తింపు తీసుకురావడమే “పెళ్లిచూపులు” (2016) సినిమా.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Harihara Veeramallu: తన్నుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు