హనుమంతుని దర్శనాన్ని పవిత్రంగా భావించే భక్తుల కోసం శ్రీ సత్య సాయి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్లు (APSRTC Tour) ఏర్పాటు చేసింది. శ్రావణ మాసం పురస్కరించుకొని జిల్లాలోని మురిడి, నేమకల్లు, కసాపురం వంటి ప్రాచీన హనుమాన్ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఒక్కరోజులో మూడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ పర్యటనలు రూపొందించబడ్డాయి.
డేట్లు, డిపోలు, టికెట్ ధర వివరాలు
ఈ టూర్లు జులై 26, 29, ఆగస్టు 2, 5, 9, 12, 16, 19 తేదీలలో మంగళవారం మరియు శనివారాలలో మాత్రమే నడవనున్నాయి. ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుగొండ, పుట్టపర్తి డిపోల నుండి బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. పుట్టపర్తి డిపో నుంచి ప్రయాణించే భక్తులకు రానుపోను చార్జీలు కేవలం రూ.660 మాత్రమే. ఈ టికెట్ ధరలో టోల్, ప్యాసింజర్ చెస్‌లు కూడా కలిపి ఉంటాయి.
బుకింగ్ సమాచారం మరియు సంప్రదించవలసిన నెంబర్లు
ఈ పుణ్యక్షేత్ర దర్శన బస్సుల టికెట్లను సమీప బస్ స్టేషన్లలోని ఓపీఆర్‌ఎస్ కౌంటర్లలో లేదా ఏటీపీ ఏజెంట్ల వద్ద పొందవచ్చు. అలాగే APSRTC వెబ్‌సైట్ ద్వారా “Hanuman Darshan” అని టైప్ చేసి డిపో పేరుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంబంధిత డిపో మేనేజర్లను ధర్మవరం (9959225859), హిందూపురం (9959225858), కదిరి (9959225860), మడకశిర/పెనుగొండ (9959229965), పుట్టపర్తి (9959225857) నెంబర్లలో సంప్రదించవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని అధికారుల విజ్ఞప్తి.
Read Also : Indiramma Houses : పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు!