ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు (Indian women’s cricket team) అదరగొట్టింది. ఇప్పటికే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న హర్మన్ సేన, వన్డే సిరీస్ (ODI series) లోనూ సత్తా చాటింది. డర్హమ్ వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 318 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత సెంచరీతో (102) చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్ 50, హర్లీన్ 45, స్మృతి మందన 45 పరిగులు చేసి విలువైన భాగస్వామ్యం అందించారు. రిచా ఘోష్ చివర్లో 38 నాటౌట్ తో హవా చూపింది.40 ఓవర్లలో భారత్ 198 పరుగుల వద్ద ఉంది. ఆ తర్వాత 10 ఓవర్లలోనే టీమిండియా 120 పరుగులు చేసింది. హర్మన్ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ, ఆ తర్వాత కేవలం 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఆకట్టుకుంది.

ఇంగ్లండ్‌కు గట్టి ప్రతిస్పందన.. కానీ తేడా స్పష్టమే
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 305 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రంట్ 98 పరుగులతో రాణించినా సెంచరీ కోల్పోయింది. ఎమ్మా లామ్ 68 పరుగులు చేసినా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.భారత్ బౌలర్లలో క్రాంతి అద్భుతంగా రాణించింది. ఆమె ఏకంగా 6 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కుదిపేసింది. చరణి 2 వికెట్లు, దీప్తి శర్మ 1 వికెట్ తీసి విజయంలో భాగమయ్యారు.
హర్మన్ ప్రీత్ చరిత్ర సృష్టించిన రోజు
ఈ మ్యాచ్‌లో హర్మన్ కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఇంగ్లండ్ వేదికగా మూడు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసింది. మిథాలీ రాజ్, మెగ్ లానింగ్ రికార్డులను అధిగమించింది.ఈ మ్యాచ్‌తో హర్మన్ వన్డేల్లో 4,000 పరుగులు పూర్తిచేసిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. అలాగే భారత తరఫున రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసింది.ఈ గెలుపుతో హర్మన్ సేన 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం భారత మహిళల క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.
Read Also : Satwik Murari : సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు : చంద్రబాబు