हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మరో విద్యార్థి మృతి

Sudha
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మరో విద్యార్థి  మృతి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) మళ్లీ మరో దురదృష్టకర ఘటనకు వేదికైంది. సెకండియర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థి చంద్రదీప్ పవార్ సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి (died)చెందాడు. గత నాలుగు రోజుల్లో ఆ సంస్థ క్యాంపస్‌లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చంద్రదీప్ వైద్యుడి సలహా మేరకు ఏదో మెడిసిన్ వాడిన‌ట్లు స్థానిక పోలీసులకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ (IIT Kharagpur) అధికారులు తెలియజేశారు. అతడు తీసుకున్న టాబ్లెట్ శ్వాసనాళంలో ఇరుక్కుపోయి, చివరికి అతని మరణానికి కార‌ణ‌మై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్ నివాసి అయిన చంద్రదీప్‌ను మొద‌ట‌ ఐఐటీ క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించారు.

 IIT Kharagpur: ఐటీ  ఖరగ్‌పూర్‌లో మరో విద్యార్థి మృతి
IIT Kharagpur: ఐటీ ఖరగ్‌పూర్‌లో మరో విద్యార్థి మృతి

అయితే వైద్యులు అప్పటికే అత‌డు చనిపోయినట్లు ధ్రువీకరించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. అతని మరణానికి అసలు కారణం శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంద‌ని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రే సమాచారం అందించడంతో వారు మంగళవారం ఉదయం ఖరగ్‌పూర్ (IIT Kharagpur) చేరుకున్నారు.అయితే గత కొన్ని రోజులుగా చంద్రదీప్‌ ఒక రకమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు స‌మాచారం. అందువల్ల అతని మరణంపై కొంత గందరగోళం నెల‌కొందని ఇన్‌స్టిట్యూట్‌లోని ఒక అధికారి తెలిపారు. ఈ నెల ‌18న కూడా మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి రితం మండల్ మృతదేహం అతని హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో క‌నిపించింది.

ఐఐటి ఖరగ్పూర్ దేనికి ప్రసిద్ధి చెందింది?

IIT KGP దాని విస్తృతమైన నివాస సౌకర్యాలకు ప్రసిద్ధి చెందింది. 2100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న IIT ఖరగ్‌పూర్ దాదాపు 10,000 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తుంది. క్యాంపస్ చుట్టూ 21 హాల్స్ ఆఫ్ రెసిడెన్సెస్ (16 అబ్బాయిలకు, 5 అమ్మాయిలకు) ఉన్నాయి. 1952లో నిర్మించబడిన పటేల్ హాల్ ఆఫ్ రెసిడెన్స్ భారతదేశం అంతటా మొట్టమొదటి IIT హాస్టల్.

భారతదేశంలో మొదటి ఐఐటి ఏది?

ఐఐటీ ఖరగ్‌పూర్ ఇన్‌స్టిట్యూట్ మొదటి ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)గా స్థాపించబడింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (ఐఐటీ ఖరగ్‌పూర్) అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో భారత ప్రభుత్వం స్థాపించిన ఒక ప్రజా సాంకేతిక మరియు పరిశోధన విశ్వవిద్యాలయం.

ఐఐటీ ఖరగ్పూర్ పాత పేరు ఏమిటి?

మొదటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మే 1950లో తూర్పు ఉన్నత సాంకేతిక సంస్థగా స్థాపించబడింది. ఇది కలకత్తాలోని ఎస్ప్లానేడ్ తూర్పులో ఉంది మరియు సెప్టెంబర్ 1950లో కోల్‌కతా (గతంలో కలకత్తా అని పిలువబడేది) నుండి నైరుతి దిశలో 120 కిలోమీటర్లు (75 మైళ్ళు) దూరంలో ఉన్న ఖరగ్‌పూర్‌లోని హిజ్లి వద్ద ఉన్న శాశ్వత క్యాంపస్‌కు మార్చబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Teacher suspend: క్లాస్ రూంలో ఇలాంటివి తగునా టీచరమ్మ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870