భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) కు సమర్పించారు. తాజాగా రాష్ట్రపతి ఆ లేఖను ఆమోదిస్తూ వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. రాజ్యాంగంలోని 67(ఎ) అధికరణ ప్రకారం, ఈ రాజీనామా తక్షణమే చట్టబద్ధంగా అమలులోకి వస్తుంది.
ఆరోగ్యమే ముఖ్యమన్న ధన్ఖడ్
తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే, వైద్యుల సలహా మేరకు ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమైన తనకు ఇప్పుడు స్వయం సంరక్షణ అవసరమని భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం కూడా అధికారిక లేఖను విడుదల చేసింది.

ప్రధాని మోదీ స్పందన
ధన్ఖడ్ రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. “ధన్ఖడ్ గారు ఉపరాష్ట్రపతి హోదాలోనే కాకుండా, తన రాజకీయ జీవితం అంతటా దేశానికి అంకితభావంతో సేవలందించారు. ఆయనకు మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా” అని మోదీ ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వైరల్ అయింది.
పదవీకాలం ఇంకా ఉండగానే తప్పుకోవడంపై చర్చ
ఇంకా దాదాపు రెండు సంవత్సరాల కాలం మిగిలి ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన ధన్ఖడ్, విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయాన్ని సాధించి రాజ్యసభ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 710 ఓట్లలో 528 ఓట్లు గెలుచుకుని, 1997 తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిచిన ఉపరాష్ట్రపతిగా రికార్డులకెక్కారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Jagdeep Dhankhar: ధన్ ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి